Begin typing your search above and press return to search.
ఉంటావో .. వెళ్తావో.. తేల్చుకో: ఆ ఎమ్మెల్యేకి జగన్ వార్నింగ్?
By: Tupaki Desk | 2 Jan 2023 2:48 PM GMTనెల్లూరు జిల్లా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై సీఎం జగన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది!. ``ప్రభుత్వంపై అయిన దానికీ.. కానిదానికీ.. విరుచుకుపడుతున్నావు. టీడీపీ ఏమైనా ట్రైనింగ్ ఇస్తోందా. ఇలా అయితే.. పార్టీలో ఉండడం ఎందుకు.. ఉంటావో.. వెళ్తావో తేల్చుకో!`` అని వార్నింగ్ ఇచ్చినట్టు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. కొన్నాళ్లుగా కోటంరెడ్డి వైసీపీ సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది మంత్రి వర్గ విస్తరణకు ముందు కూడా ఆయన తన నియోజకవర్గంలో పనులు చేయడం లేదని.. నడిరోడ్డుపైనా.. మురిగికుంటలోనూ కూర్చుని నిరసన తెలిపారు.
ఇక, మంత్రి వర్గంలో చోటు లభించకపోయే సరికి.. కన్నీరు పెట్టుకుంటూనే.. తీవ్రవిమర్శలు చేశారు. నిజానికి 2019 ఎన్నికల్లో జగన్‌ను సీఎం చేయాలని బావించిన నాయకుల్లో కోటంరెడ్డి కూడా ఒకరు. జగన్ కోసం.. ఏమైనా చేస్తామన్న నాయకుల్లోనూ ఈయన కూడా ఉన్నారు. అయితే.. జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్య ధోరణి, కొందరికే సీఎం జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారనే వాదనతో కోటంరెడ్డికి ప్రాధాన్యం లేకుండా పోయిందనేది వాస్తవం. ఇక, కాకాని గోవర్ధన్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం .. కోటం రెడ్డికి మరింత ఆగ్రహం తెప్పించింది.
ఇటీవల మనసులో ఏముందో ఏమో.. అధికారులను అడ్డుపెట్టుకుని.. మంత్రి కాకాని సమక్షంలోనే విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో తాజాగా.. ముఖ్యమంత్రి జగన్ నుంచి ఆయన పిలుపు రాగానే.. ఉన్నపళాన తాడేపల్లికి వచ్చి సీఎంను కలిశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కోటంరెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తాడేపల్లి వర్గాల సమాచారం. కోటంరెడ్డితో పాటు నెల్లూరు జిల్లా పార్టీ రీజినల్ ఇన్చార్జి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా సీఎంను కలిసినట్టు తెలిసింది.
నెల్లూరులోని తన రూరల్ నియోజకవర్గంలో 2700 పింఛన్లు తొలగించడంపై కోటంరెడ్డి విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక కార్యదర్శి రావత్ తనకు కనీసం మర్యాద ఇవ్వలేదని కూడా అన్నారు. రోడ్లు సరిగాలేవని పొట్టెపాలెం వద్ద వంతెన నిర్మాణం నిధులు కొరత ఉందని, మురుగు కాలువలు వంటి సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూ విమర్శలు చేశారు.
విమర్శలు ఎందుకు చేయాల్సి వచ్చిందో సీఎంకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వివరణ ఇచ్చినట్టు సమాచారం. అయితే.. జగన్ మాత్రం ఉంటారో వెళ్తారో తేల్చుకోవాలని. ఇక నుంచి ఇలాంటి పునరావృతమైతే..కఠిన నిర్ణయాలు తప్పవని హెచ్చరించినట్టు సమాచారం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.