Begin typing your search above and press return to search.
ఒక్క ఏడాది.. ఏపీ కరువు తీరుస్తా.. జగన్ సంచలనం
By: Tupaki Desk | 21 Jan 2020 5:38 AM GMTఏపీ కలల ప్రాజెక్టు పై సీఎం జగన్ సంచలన విషయం బయటపెట్టారు. అసెంబ్లీ సాక్షిగా పోలవరంపై క్లారిటీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు పై అవాకులు, చెవాకులు పేల్చి నిర్మాణంపై ఆరోపణలు చేసిన ప్రతిపక్ష నేత చంద్రబాబుకు దిమ్మదిరిగే సమాధానం ఇచ్చారు జగన్.
అసెంబ్లీ లో మూడు రాజధానుల బిల్లు ఆమోదం సందర్భంగా సీఎం జగన్ ఏపీ కలల ప్రాజెక్టు ‘పోలవరం’ పరిస్థితిపై క్లారిటీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టును రివర్స్ టెండరింగ్ చేశామని.. దానివల్ల ఏకంగా 830 కోట్ల రూపాయలు ఆదా చేశామని సీఎం జగన్ సభాముఖం గా ప్రకటించారు. ఆదా చేయడమే కాదని.. ప్రాజెక్టును ఇప్పటికే ప్రారంభించామని.. వర్షాలు తగ్గగానే శరవేగంగా పనులు మొదలు పెట్టామని.. జెట్ స్పీడ్ తో జరుగుతున్నాయని.. 2021 జూన్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని.. రైతులకు నీళ్లు ఇస్తామని సగర్వం గా ప్రకటిస్తున్నానని జగన్ భావోద్వేగం తో అన్నారు. ప్రాజెక్టులో బాగా పనులు జరుగుతున్నాయన్నారు.
చంద్రబాబులా పోలవరాన్ని ఏటీఎంలా వాడడం లేదని.. రైతులకు నీళ్లు ఇవ్వడానికి చిత్తశుద్ధితో పూర్తి చేస్తున్నామని జగన్ తెలిపారు.
పోలవరంపై టీడీపీ, పచ్చమీడియా చేస్తున్న ప్రచారానికి సీఎం జగన్ అసెంబ్లీ సాక్షి గా కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు ఐదేళ్ల లో పూర్తి చేయని ప్రాజెక్టు ను ఏడాది లోనే పూర్తి చేస్తామని సంచలన ప్రకటన చేయడం పై ఏపీ రైతులు, ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది.