Begin typing your search above and press return to search.
కొత్త ఫేస్ తో ఏపీ కాంగ్రెస్... ?
By: Tupaki Desk | 6 Oct 2021 7:57 AM GMTకాంగ్రెస్ పార్టీ అంటే ఆషా మాషీది కాదు, దేశంలో ఎంతో చరిత్ర ఉన్న పార్టీ అది. దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి పోరాడిన పార్టీగా ఒక గుర్తింపు ఉంది. అంతేనా ఒకరిద్దరు తప్ప దేశానికి మొత్తం ప్రధానులను అందించిన ఘనత కూడా ఆ పార్టీదే. అదే సమయంలో సుదీర్ఘకాలం పాటు ప్రధానిగా సేవలు చేసిన నెహ్రూ, ఇందిరల రికార్డు ఈ రోజుకీ చెరిగిపోనిది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కి ఒకనాడు పెట్టని కోట. విభజన తరువాత ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి తల్లకిందులు అయినా కూడా నిరాశపడడంలేదు. ఉందిలే మంచి కాలం ముందు ముందునా అనుకుంటూ ఉన్నపాటి నేతలతోనే కాలం నెట్టుకువస్తోంది.
ఏపీలో కాంగ్రెస్ మళ్లీ కాళ్ళూనుకుంటుందా అంటే ఇది రాజకీయం, ఎపుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. అందువల్ల కాంగ్రెస్ వీర భక్తుల ఆశలు కూడా అలాగే ఉంటాయి. అన్నింటికీ మించి కాంగ్రెస్ బలమంతా జనంలోనే ఉంది. పైగా ఆ పార్టీ పేరు గుర్తూ తెలియని వారు ఎక్కడా లేరు. దాంతో పాటు ఇపుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కి కొంత ఆశావహ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేంద్రంలో రెండు దఫాలుగా అధికారంలోకి వచ్చిన బీజేపీకి అతి పెద్ద రాష్ట్ర ఉత్తరప్రదేశ్ సహా ఉత్తరాది రాష్ట్రాలు హ్యాండ్ ఇచ్చే సీన్ కనిపిస్తోంది. మరో వైపు కాంగ్రెస్ ఎంత కాదనుకున్నా జాతీయ స్థాయిలో బీజేపీని ఢీ కొట్టే స్థితిలో ఉంది.
అలా ఆలోచించుకుంటే జాతీయ స్థాయిలో కనిపిస్తున్న అనుకూలత రెండు తెలుగు రాష్ట్రాల మీద కూడా ప్రసరించే చాన్స్ ఉందని కూడా అంటున్నారు. తెలంగాణాలో రేవంత్ రెడ్డి రాకతో కాంగ్రెస్ బాగానే పుంజుకుంది. రేవంత్ తెగ దూకుడు చేస్తున్నారు. దాంతో కాంగ్రెస్ లోని నైరాశ్యం కూడా పోతోంది. ఏపీ విషయం చూస్తే అలా లేదు దాంతో అక్కడ కూడా కొత్త నాయకత్వాన్ని తెచ్చి పార్టీకి జోష్ కలిగించాలని అధినాయకత్వం ఆలోచన చేస్తోంది అంటున్నారు. ప్రస్తుతం ఉన్న పీసీసీ చీఫ్ సాకే శైలజానాధ్ మంచి వారే కానీ దూకుడు లేకపోవడం వల్ల కాంగ్రెస్ బండి అలాగే ఉండిపోయింది.
మరి కాంగ్రెస్ ని జోరెత్తించే రౌత్ కోసం అన్వేషణ అయితే గట్టిగానే సాగుతోందిట. అన్నీ అనుకూలిస్తే తొందరలోనే కాంగ్రెస్ కి కొత్త కామందు వస్తారని అంటున్నారు. అంటే ఏపీ మీద కాంగ్రెస్ హై కమాండ్ దృష్టి పెడుతోంది అని అర్ధమవుతోంది. ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో కాంగ్రెస్ కనుక పుంజుకుంటే ఎవరికి లాభం ఎవరికి నష్టం అన్న చర్చ కూడా ఉంది. ఏది ఏమైనా కాంగ్రెస్ 2024 మీద కోటి ఆశలు పెట్టుకుంది. అది 2014, 2019లా నిరాశపరచదు అని కూడా గట్టి ధీమాతో ఉంది. చూడాలి మరి ఏపీలో కాంగ్రెస్ చక్ర్తం ఎలా పరుగు తీస్తుందో.