Begin typing your search above and press return to search.

AP : కోవిడ్ తో ఎంతమంది చనిపోయారో తెలుసా ?

By:  Tupaki Desk   |   30 July 2022 5:08 AM GMT
AP : కోవిడ్ తో ఎంతమంది చనిపోయారో తెలుసా ?
X
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఆంధ్రపద్రేశ్ లో 47, 228 మంది చనిపోయినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా కోవిడ్ తో ఎంతమంది మరణించారు, ఎంతమందికి పరిహారం అందించారనే లెక్కలను కేంద్రప్రభుత్వం విడుదలచేసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుండి ఈ యేడాది మే 27వ తేదీకి 7,91,353 మంది చనిపోయినట్లు కేంద్ర మంత్రి పార్లమెంటులో ప్రకటించారు.

అంటే ఇన్ని లక్షల దరఖాస్తులను పరిష్కరించి కుటుంబసభ్యులకు పరిహారం అందించారనే లెక్క ఆధారంగా 7 లక్షల మంది చనిపోయినట్లు అంచనా వేశారు. మిగిలిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను పక్కనపెట్టేస్తే ఏపీలో మాత్రం 50, 399 దరఖాస్తులు వస్తే అందులో 47,222 దరఖాస్తుల క్లైములను ఆమోదించి పరిహారం చెల్లించినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. చనిపోయిన వారి కుటుంబాలకు తలా రు. 50 వేలు చెల్లించినట్లు ఏపీ ప్రభుత్వం కేంద్రానికి తెలిపిందట.

మిగిలిన దరఖాస్తులను తిరస్కరించిందని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో మృతుల సంఖ్య సుమారు 14 వేలు మాత్రమే అని గతంలో ప్రకటించినట్లు సమాచారం. మృతుల విషయంలో బయటకు ఒక లెక్య ప్రకటించి కేంద్రానికి మరోలెక్క ఎందుకు ప్రకటించింది ? ఎందుకంటే జనాలను భయాందోళనల్లోకి నెట్టడం ఇష్టంలేకే అని ప్రభుత్వం సమాధానమిచ్చింది.

కరోనా వైరస్ మహమ్మారితో ఇంతమంది చనిపోతున్నారు, అంతమంది చనిపోతున్నారని వాస్తవ లెక్కల ప్రకటిస్తే సమాజంలో భయాందోళనలు పెరిగిపోవటం ఖాయం. వైరస్ సోకని వారితో పాటు వైరస్ సోకనివారిలో టెన్షన్ పెరిగిపోకూడదంటే ఏ ప్రభుత్వం అయినా మృతుల సంఖ్యను తక్కువగానే చెబుతుంది.

ఎందుకంటే చనిపోయిన వారిలో వైరస్ సమస్యతో చనిపోయిన వారితో పాటు మెంటల్ టెన్షన్ తో చనిపోయిన వారు కూడా ఉన్నారు. ఇలాంటి మరణాలను తగ్గించేందుకే ప్రభుత్వం మరణాల సంఖ్యను బయటకు తగ్గించి చెప్పుండచ్చు.

ఇపుడు కరోనా వైరస్ టెన్షన్ తగ్గిపోయింది కాబట్టి అప్పట్లో ఇంతమంది చనిపోయారని ప్రభుత్వాలు ప్రకటించినా టెన్షన్ పడేవారు పెద్దగా ఉండరు. అందుకే ఇపుడు వాస్తవ లెక్కలను ప్రకటించింది.