Begin typing your search above and press return to search.
పవన్ కోసం ఎర్రన్నలు లబలబ... ఎందుకంటా...?
By: Tupaki Desk | 18 Nov 2022 12:30 AM GMTఏపీలో పొత్తులు ఉండాలి. ఏదో విధంగా తాము అసెంబ్లీలో అడుగుపెట్టాలి. ఇదీ ఎర్రన్నల అజెండా. నిజానికి గత దశాబ్ద కాలంగా ఏపీ అసెంబ్లీలో కామ్రేడ్స్ కి ప్రాతినిధ్యం లేదు. 2009 ఉమ్మడి ఏపీలో జరిగిన ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే కొన్ని సీట్లు దక్కాయి. అలా అపుడు కనిపించిన కామ్రేడ్స్ విభజన తరువాత అయిపూ అజా లేకుండా పోయారు. ఇందులో కూడా సీపీఎం సమైక్య వాదాన్ని వినిపించింది. సీపీఐ ఏపీని రెండు ముక్కలు చేయమంది. అలా ఏపీలో కాలూనవచ్చు అనుకున్నా ఆ పార్టీ ఆశలు తీరడంలేదు.
ఇక చూస్తే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టీడీపీ పొత్తు పెట్టుకుని గెలిచాయి. వైసీపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. అలా మూడంటే మూడు పార్టీలే అసెంబ్లీలో కనిపించాయి. 2019 నాటికి సీన్ ఏదీ మారలేదు. యధాప్రకారం వైసీపీ టీడీపీ గెలిచాయి. అయితే ఈసారి వైసీపీ అధికారంలోకి వచ్చింది. బీజేపీకి బదులుగా జనసేన ఒకే ఒక మెంబర్ తో చట్ట సభలో తన పేరుని నమోదు చేసుకుంది. జనసేనతో పొత్తు పెట్టుకున్న కమ్యూనిస్టులు ఎక్కడా గెలవలేదు.
ఇపుడు అంటే 2024లో అయినా బోణీ కొట్టాలని చూస్తున్నారు. బీజేపీ నుంచి జనసేన బంధాన్ని లాగేస్తే టీడీపీ జనసేన కామ్రేడ్స్ కాంగ్రెస్ లతో పొత్తు పెట్టుకుని బ్రహ్మాండంగా గెలవవచ్చు అని ఈ మధ్యనే ఒక టీవీ షోలో సీపీఐ నారాయణ చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ బీజేపీతో కలసి వెళ్తున్నారని అది మంచి విధానం కాదని నారాయణ అన్నారు. ఇక అదే షోలో ఉన్న జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ఆయనకు గట్టిగా సమాధానం ఇచ్చారు.
ఏపీలో టీడీపీ వైసీపీలకు వ్యతిరేకంగా తాము పోరాటం చేయాలనుకుంటున్నామని అసలు విషయం చెప్పేశారు. అయితే నారాయణ మాత్రం వైసీపీ కంటే బీజేపీ కంటే టీడీపీ తక్కువ ప్రమాదం కాబట్టి ఆ పార్టీతో జట్టు కట్టాలని సూచించారు. సరే ఆ వాదన ఎలా ఉన్నా దాన్ని కంటిన్యూ చేస్తున్నారు ఏపీ సీపీఐ కార్యదర్శి రామక్రిష్ణ. ఆయన అంటున్నది ఏంటంటే విపక్షం ఓట్లు చీలకూడదు, అంతా కలసి పోటీ చేసి వైసీపీని గద్దె దించాలి అని ఎన్నో కబుర్లు చెప్పిన పవన్ బీజేపీతో పొత్తులో ఉండడమేంటి అని నిందించారు.
అంతే కాదు బీజేపీని వదిలిపెట్టకుండా పవన్ ఎన్ని కబుర్లు చెప్పినా జనాలు నమ్మరని కూడా చెప్పేశారు. పవన్ కళ్యాణ్ణీ పట్టుకుని రాజకీయ అమాయకుడా లేక అలా నటిస్తున్నారా అని కూడా అడిగేశారు. మొత్తానికి చూస్తే మోడీ తో పవన్ భేటీ తరువాత పవన్ అయితే నోరు విప్పడంలేదు. ఆయన మౌనంగానే తన పని తాను చేసుకుంటున్నారు. ఇక విజయనగరంలో అయితే పవన్ తనకు ఓటేయాలని, తనను సీఎం చేయాలని జనాలను అడిగారు. అది కామ్రేడ్ కి తప్పుగా తోచిందట.
పవన్ ప్రతిపక్షం అంతా ఒక్కటిగా ఉండాలని చెబుతూ మళ్లీ ఇలా సెపరేట్ గా మాట్లాడమేంటని గుస్సా అవుతునారు రామక్రిష్ణ సార్. అయితే పవన్ కి జీవితంలో సీఎం కావాలని కోరిక ఉండకూడదా. ఆయన ఒంటరిగా పోటీ చేయకూడదా. లేక ఆయన తన రాజకీయ అజెండాను నిర్ణయించుకోవడానికి హక్కు లేదా ఇవన్నీ జనసైనికుల నుంచి వస్తున్న ప్రశ్నలు. ఎంతసేపూ ఏదో పార్టీకి పక్క వాయిద్యంగా ఉండాలా అని వారు అడుగుతున్నారు.
సరే ఇంత ఉద్యమ రాజకీయ చరిత్ర ఉన్న కామ్రేడ్స్ కి ఎటూ అధికారం మీద మోజు ఉందో లేదో తెలియదు బూర్జువాలు అంటూనే అన్ని పార్టీలతోనే అంటకాగుతారు. పవన్ తాను అయినా అధికారం మీద గురి పెట్టి ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడం అక్కడికి తప్పుగా ఎర్రన్నలకు తోచడమే వింత అంటున్నారు. పైగా పవన్ కళ్యాణ్ ఎంతసేపూ టీడీపీకి సపోర్టుగా ఉండి బాబునే సీఎం చేయాలని, తమకూ కొన్ని సీట్లు ఆ పొత్తులో దక్కితే చాలు అని ఎర్రన్నలు అనుకుంటే మంచిదే కానీ. జనసేనాని కూడా అధికారం కోసమే పార్టీ పెట్టారు అన్నది మరచిపోవడమే ట్విస్ట్ మరి.
అంతే కాదు టీడీపీతో పొత్తునకు జనసేనలోనే వ్యతిరేకత ఉంది. పవన్ సీఎం అని వారు అంటున్నారు. మరి టీడీపీతో టీయారెస్ తో ఇలా బూర్జువా పాటీలతో కామ్రేడ్స్ పొత్తు పేరిట కలిసినా ఆ పార్టీ సిద్ధాంతకర్తలకు అభ్యంతరం లేదేమో కానీ జనసేన వర్గాలు మాత్రం పవన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. మరి ఆ దిశగా ఏమైనా నారాయణ, రామకృష్ణ బాబుతో చెప్పి ఒక మాట తీసుకుని రాగలరా. అలా ఏమీ చేయలేని దానికి తమ రాజకీయం కోసం పవన్ని పట్టుకుని విమర్శలు చేయడం తగునా ఎర్ర సోదరా అంటే జవాబు ఉందా.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.