Begin typing your search above and press return to search.

బాబు ఇంటికి ఎల్వీఎస్.. గంట మాట్లాడుకున్నార‌ట‌!

By:  Tupaki Desk   |   13 May 2019 8:22 AM GMT
బాబు ఇంటికి ఎల్వీఎస్.. గంట మాట్లాడుకున్నార‌ట‌!
X
ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. ఇప్ప‌టివ‌ర‌కూ ఏపీలో సీఎం వ‌ర్సెస్ సీఎస్ గా న‌డుస్తున్న లొల్లి కాస్తా కూల్ అయ్యే ప‌రిణామం చోటు చేసుకుంది. ఎన్నిక‌ల వేళ ఏపీ సీఎస్ గా ఎంపిక చేసిన ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం పై ముఖ్య‌మంత్రి హోదాలో
చంద్ర‌బాబు ప‌లు విమ‌ర్శ‌లు చేయ‌టం తెలిసిందే. దీంతో.. ముఖ్య‌మంత్రికి రాష్ట్ర చీఫ్ సెక్ర‌ట‌రీకి మ‌ధ్య మాట‌లు స‌రిగా లేక‌పోవ‌ట‌మే కాదు.. ఒక‌ద‌శ‌లో ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం నెల‌కొంద‌న్న భావ‌న క‌లిగేలా ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి.
ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉన్న వేళ‌లోనూ రివ్యూలు చేస్తాన‌ని చెబుతున్న సీఎం తీరుపైన సీఎస్ అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌టం.. సీఎస్ కు ఉండే పరిధిపై సీఎం చంద్ర‌బాబు మాట్లాడ‌టం లాంటివి వ‌రుస‌పెట్టి జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉండ‌గా..తాను మంత్రివ‌ర్గ స‌మావేశాన్ని నిర్వ‌హిస్తాన‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించ‌టం.. దానికి ఈసీ అనుమ‌తి అవ‌స‌ర‌మవుతుంద‌న్న మాట‌ను సీఎస్ చెప్ప‌టం తెలిసిందే.

మంగ‌ళ‌వారం కేబినెట్ మీటింగ్ నిర్వ‌హించాల‌ని భావిస్తున్న వేళ‌.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో సీఎస్ ఎల్వీఎస్ సీఎం నివాసానికి ఈ రోజు వెళ్లారు. దాదాపుగా గంట‌కు పైనే వారి మ‌ధ్య స‌మావేశం జ‌రిగిన‌ట్లుగా చెబుతున్నారు. ఇంతసేపు సీఎం.. సీఎస్ మ‌ధ్య ఏమేం అంశాలు చోటు చేసుకున్నాయి? అన్నది ప్ర‌శ్న‌గా మారింది. సీఎంకు.. సీఎస్ కు మ‌ధ్య తేడా ఉంద‌ని.. వారిద్ద‌రి మ‌ధ్య సానుకూల వాతావ‌ర‌ణం లేద‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతున్న వేళ‌.. వారిద్ద‌రి భేటీ ఆస‌క్తిక‌రంగా మారింది. స‌మావేశంలో వారిద్ద‌రు అంత‌సేపు ఏం మాట్లాడుకున్నార‌న్న‌ది ఒక అంశ‌మైతే.. ఈసీ నుంచి అనుమ‌తి వ‌చ్చిన త‌ర్వాత మాత్ర‌మే మంత్రివ‌ర్గ స‌మావేశాన్ని నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రీ.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం నుంచి ఏపీ కేబినెట్ స‌మావేశానికి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చేస్తుందా? అన్న‌ది ఉత్కంఠ‌గా మారింది.