Begin typing your search above and press return to search.
కరోనా తో మృతి చెందిన ఏపీ కీలక నేత..ఎవరంటే?
By: Tupaki Desk | 3 Sept 2020 12:00 PM ISTఏపీలో కరోనా జోరు ఏ మాత్రం తగ్గడంలేదు. రోజురోజుకి రాష్ట్రంలో నమోదు అయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సామాన్యుల నుండి ప్రముఖుల వరకు అందరూ కరోనా భారిన పడుతున్నారు. అలాగే ప్రతి రోజు కూడా సామాన్య ప్రజలతో పాటుగా కొంతమంది ప్రముఖులు కూడా మృతి చెందుతున్నారు. తాజాగా ఏపీ రేషల్ డీలర్స్ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ వి.కృష్ణదాస్ కరోనా సోకి , కోలుకోలేక కన్నుమూశారు. అతని భార్యకు కూడా కరోనా సోకడంతో ప్రస్తుతం వెంటీలేటర్ మీద చికిత్స పొందుతుండగా, అదే ఆసుపత్రిలో కుమారుడు కూడా ఉన్నారు.
ఇకపోతే , ఏపీలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం గత సెప్టెంబర్ లో డోర్ డెలివరీకి పైలెట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాను ఎంపిక చేసింది. ఈ సందర్భంగా పంపిణీ కారణంగా కృష్ణదాస్ కు కరోనా సోకిందని కుటుంబసభ్యులు తెలిపారు. కాగా, కుటుంబం మొత్తం కరోనా బారినపడడంతో బంధువుల్లో తీవ్ర విషాదం నెలకొన్నది.
ఇక , ఏపీలో కరోనా వేగంగా పాకిపోతోంది. నిత్యం భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా, 60,804 శాంపిల్స్ పరీక్షించగా 10,392 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో 1,199, చిత్తూరు జిల్లాలో 1,124 కొత్త కేసులను గుర్తించారు. అతి తక్కువగా కృష్ణా జిల్లాలో 397 కేసులు వచ్చాయి .ఇక, గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 72 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 4,125కి పెరిగింది. తాజాగా 8,454 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,55,531 కాగా, 3,48,330 మంది కరోనా నుంచి కోలుకుని ఇంటికి వెళ్లారు.