Begin typing your search above and press return to search.
ఏపీ 3 నెలల్లో చేసిన అప్పు 68శాతం
By: Tupaki Desk | 30 Aug 2020 11:30 AM GMTరాజధాని కూడా లేని రాష్ట్రం.. అప్పటికే చంద్రబాబు అమరావతి, సంక్షేమం పేరిట 2 లక్షల కోట్లు అప్పు చేసి కుప్ప పెట్టాడు. ఇక జగన్ సర్కార్ రాగానే నవరత్నాల పేరిట ప్రజలకు సంక్షేమ పథకాలు వండి వార్చింది. ఇంకేముంది.. ఏపీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. అప్పులతోనే ప్రభుత్వం నడిచే పరిస్థితికి వచ్చింది.
కరోనా తెచ్చిన ఆర్థిక సంక్షోభం వల్ల గత కొన్ని నెలలుగా ఏపీ ప్రభుత్వానికి ఆశించిన ఆదాయం రావడం లేదు. దీంతో నెలా నెలా కానకష్టంగా మారిన నేపథ్యంలో ఉద్యోగుల జీతాలు, ఆసరా పెన్షన్లు, తదితరాల కోసం అప్పు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం కొద్దిమంది మంత్రుల సంతకాలతో ఆర్డినెన్స్ దస్త్రాన్ని గవర్నర్ కు పంపినట్లు ప్రచారం సాగుతోంది.
కొత్తగా అప్పు పుట్టాలంటే.. ఎక్కువగా తెచ్చుకోవాలంటే ఎఫ్ఆర్బీఎం పరిమితిని 3శాతం నుంచి 5 శాతంకు పెంచుతూ చట్ట సవరణ కోసం ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆ అప్పుతో వీటన్నింటిని వెళ్లదీయాలని చూస్తోంది.
ఇక ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలోనే ఏపీ ఏకంగా రూ.33294 కోట్లను అప్పుల రూపంలో సమీకరించిందని కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ లెక్కలు వెల్లడించాయి. ఈ ఏడాది మొత్తం రుణ లక్ష్యంలో ఇది 68శాతం కావడం గమనార్హం.
దీంతో ప్రభుత్వం రుణాల ద్వారా డబ్బు సమకూర్చుకుంటోంది. ఈ ఆదాయలోటు కేవలం ఆంధ్రాలోనే కాక ఇతర రాష్ట్రాలలో కూడా ఉంది.