Begin typing your search above and press return to search.

జగన్ ఓకే అంటే రాజీనామే..డిప్యూటీ సీఎం సంచలనం

By:  Tupaki Desk   |   16 Feb 2020 4:38 AM GMT
జగన్ ఓకే అంటే రాజీనామే..డిప్యూటీ సీఎం సంచలనం
X
ఢిల్లీలో సీఎం జగన్ మంత్రాంగం నడుపుతున్నారు. బీజేపీకి దగ్గరవుతున్నారు. బీజేపీతో పొత్తుకు రెడీ అన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం - వైసీపీ సీనియర్ నేత అమ్జద్ భాషా సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో కనుక ‘పౌరుల జాతీయ రిజిస్టర్’ ఎన్నాఆర్సీకి అనుమతిస్తే తాను తన పదవికి రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు.

ఇప్పటికే ఎన్నార్సీని ప్రకటించినప్పుడు సీఎం జగన్ వ్యతిరేకించారు. ఎన్నార్సీలకు వ్యతిరేకంగా ముస్లింల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో డిప్యూటీ సీఎం అమ్జద్ భాషా పాల్గొని బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడారు. మైనారిటీల ప్రయోజనాలను పరిరక్షించడానికి ఏమేరకైనా వెళ్తానని అన్నారు. అయితే ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో బీజేపీతో సాన్నిహిత్యం దృష్ట్యా ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది.

ఎన్నార్సీ అమలు చేయాలని జగన్ ప్రభుత్వం కనుక ముందుకెళితే ప్రభుత్వం నుంచి వైదొలగడానికి తాను వెనుకాడనని.. నాకు పోస్టులు ముఖ్యం కాదని.. ప్రజల ఆసక్తులు, ఆకాంక్షలే ముఖ్యమైనవని ఏపీ డిప్యూటీ సీఎం అమ్జద్ భాషా అన్నారు.

సీఏఏ - ఎన్నార్సీలకు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించాలని సీఎం జగన్ ను ఒప్పించనున్నట్టు డిప్యూటీ సీఎం అమ్జద్ భాషా తెలిపారు. జగన్ ప్రభుత్వం ఎన్నార్సీ - ఎన్పీఆర్ లను రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించదనే నమ్మకం ఉందని భాషా తెలిపారు. వైసీపీకి ఎన్డీఏ ప్రభుత్వంలో చేరే అవకాశం లేదని భాషా స్పష్టం చేశారు. వైసీపీ లౌకిక పార్టీ అని ఆయన నొక్కి చెప్పారు.