Begin typing your search above and press return to search.
దండం పెడుతా.. అలా చేస్తే నా పదవి పోతుందన్న ఏపీ మంత్రి
By: Tupaki Desk | 30 Dec 2020 1:27 PM GMTఓ నిండు సభలో ఏపీ మంత్రి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ శాఖను ఉద్దేశించిన చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. అవిప్పుడు ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
ఏపీలో జరుగుతున్న భూసర్వే కార్యక్రమంలో తాజాగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా గుడిపాల మండలం ముట్టుకూరు పల్లెలో జరిగిన బహిరంగ సభలో ఆయన రెవెన్యూ వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు.కొందరు రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
సర్వే నంబర్లు కూడా రెవెన్యూ అధికారులు డబ్బులకు ఆశపడి మారుస్తున్నారని.. కలెక్టర్, జగన్ తపన ఫలించడం లేదని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వాపోయారు. రెవెన్యూ డిపార్ట్ మెంట్ కు పాదాభివందనం చేస్తానని.. మీరు డబ్బుకు, మందుకు అలవాటు పడితే రెవెన్యూ వ్యవస్థలో మార్పు తీసుకురాలేమన్నారు. ఈ విషయం మీరు సీఎంకు చేరవేస్తే నన్ను మంత్రి పదవికి కూడా వద్దంటారని.. ఈ నిజాలు వెల్లడించవద్దని కోరారు.
తన నీతి నిజాయితీ చూసే జగన్ ఈ పదవి ఇచ్చారని.. నేను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని.. నారాయణ స్వామి కమీషన్లు తీసుకొని పనులు చేస్తున్నారని.. ఏ ఒక్కరు చెప్పినా సరే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు.
డిప్యూటీ సీఎం నారాయణస్వామి రెవెన్యూశాఖపై చేసిన వ్యాఖ్యలు చిత్తూరు జిల్లాలో హాట్ టాఫిక్‌గా మారాయి. సీఎంకు తెలిస్తే తన పదవి ఊడిపోతుందన్న వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.