Begin typing your search above and press return to search.
ప్రభుత్వ ఉద్యోగులపై ఏపీ డిప్యూటీ స్పీకర్ సంచలన వ్యాఖ్యలు!
By: Tupaki Desk | 6 March 2023 4:25 PM ISTఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నవారు కేవలం 15 శాతం మాత్రమేనని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉద్యోగులు వైసీపీకి ఓటేయరని మనలో చాలా మంది అనుకుంటున్నారని.. అయితే అది నిజం కాదని అన్నారు. కేవలం 15 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారన్నారు. ఈ 15 శాతం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేవారు పంచుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో కోలగట్ల వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా నిలిచాయి.
మార్చి 13న జరగనున్న ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన సీతంరాజు సుధాకర్ ను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ విజయం చేకూర్చాలని పట్టభద్రులకు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి కోరారు. ఈ మేరకు ఆయన విజయనగరంలో పలు ప్రాంతాల్లో సీతంరాజు సుధాకర్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
ఈసారి ఎన్నికల్లో అశోక్ గజపతిరాజు, తాను పోటీ చేస్తే అశోక్ గెలుస్తారని చాలా మంది అంటున్నారని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కూడా అశోక్ గజపతిరాజు ప్రచారం చేసినప్పుడు టీడీపీ ఎందుకు ఓడిపోయిందని ప్రశ్నించారు. అశోక్ రోడ్డు మీద కొస్తే ఎన్నికలొచ్చినట్టు తెలుస్తుందని ఎద్దేవా చేశారు. తాను జనంలోకి వెళ్తే సంక్షేమ పనులు గుర్తొస్తాయని వ్యాఖ్యానించారు.
రాష్ట్రాభివృద్ధికి వైసీపీ చేస్తున్న కృషిని ప్రజలు గమనించాలని కోలగట్ల కోరారు. పారిశ్రామికపరంగా రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారన్నారని తెలిపారు.
దీని ఫలితంగానే పెట్టుబడిదారుల సదస్సులో 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆరు లక్షల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని చెప్పారు.
కాగా కోలగట్ల వీరభద్రరావు చేసిన వ్యాఖ్యలపైన చర్చ జరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగుల్లో 15 శాతం మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని స్వయంగా వైసీపీ ఎమ్మెల్యేనే చెబుతుండటం ఆసక్తి రేపుతోందని అంటున్నారు. కేవలం 15 శాతం మాత్రమే కాదని.. ప్రభుత్వ ఉద్యోగుల అంతా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉన్నారని చెబుతున్నారు. అందరికీ ప్రతి నెలా మూడో వారం గడిస్తేనే కానీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అందడం లేదని గుర్తు చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.