Begin typing your search above and press return to search.

కరెన్సీ నోట్లతో కరోనా వ్యాప్తి..క్లారిటీ ఇచ్చిన ఏపీ డీజీపీ!

By:  Tupaki Desk   |   15 April 2020 11:50 AM GMT
కరెన్సీ నోట్లతో కరోనా వ్యాప్తి..క్లారిటీ ఇచ్చిన ఏపీ డీజీపీ!
X
కరోనా మహమ్మారి దేశంలో అలజడి సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. అలా చేస్తే కరోనా వైరస్ సోకుంతుంది .. ఇలా చేస్తే కరోనా సోకుతుంది అని వాట్సాప్ లో తెగ షేర్ చేస్తున్నారు. తాజాగా కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతున్నట్టు ఒక వార్త సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అవుతుంది. డబ్బు ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుంది అని తెలియడంతో ప్రజల్లో ఆందోళన మరింత ఎక్కువైంది.

ఈ నేపథ్యంలోనే ఫేక్ వార్తల ప్రచారం పై ఏపీ డీజీపీ సవాంగ్ స్పందిస్తూ ... సోషల్ మీడియా లో ప్రచారాలు విస్తృతంగా వస్తున్నాయని అందులో వాస్తవాలు ఎన్ని అనేది తేల్చి ప్రజలకు భరోసా కల్పిస్తామని - తప్పుడు సమాచారం త్వరగా ప్రచారం అవుతుందన్న ఆయన సమాచారంలో నాణ్యత కావాల్సిన సమయం ఇది అని అన్నారు. చాలా మంది కావాలని తప్పుడు ప్రచారం చేస్తారని వాస్తవాలకు దూరంగా సమాజంలో పరిస్థితులు ఉంటే అది మంచిది కాదని అన్నారు. అలాగే - కరెన్సీ నోట్ల ద్వారా వైరస్ వ్యాప్తి అనేది వాస్తవం కాదని అయన తెలియజేసారు. ఇక డిజిటల్ ట్రాన్సక్షన్ ఎంతవరకు వీలుంటే అంటే వరకు చేస్తే బాగుంటుందని తెలిపారు. అలాగే ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చి తప్పించుకోలేరని - కొద్దిగా లేటు అయినా కూడా శిక్ష మాత్రం ఖాయం అని తెలిపారు.

ఈ తరుణంలోనే కరోనా పై సోషల్ మీడియా లో వస్తున్న తప్పుడు వార్తలను అరికట్టేందుకు ఏపీ పోలీస్ శాఖ ఒక వాట్సప్ నెంబర్ ని అందుబాటులో తీసుకువచ్చారు. 90716 66667...ఈ వాట్సాప్ నెంబర్ ని ఏపీ డీజీపీ సవాంగ్ ప్రారంభించారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలని ఆ నెంబర్ కు వాట్సప్ చేస్తే ...ఆయా వర్గాలతో క్లారిటీ తీసుకొని తిరిగి వాస్తవ సమాచారం అందించనున్నారు పోలీసులు. ఈ నెంబర్ లాంచ్ చేసే సమయంలో డీజీపీ తో ఆన్ లైన్ లో వీడియో కాల్ లో సెలబ్రిటీలు సింధు.. సినీనటులు అడవి శేషు - నిఖిల్ - గాయని కొండవీటి సత్యవతి తదితరులు పాల్గొన్నారు. ఏపీలో కరోనా కేసులపై మాట్లాడుతూ .. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో ఎక్కువ శాతం ఢిల్లీ నుండి వచ్చిన వారో ..లేక , వారితో సంబంధం ఉన్నవారే అని తెలిపారు. ఏపీ నుండి 1033 మంది ఢిల్లీ వెళ్లారని - 6730 సెకండరీ కాంటాక్ట్ లు జరిగాయని తెలిపారు.