Begin typing your search above and press return to search.
మొదలెట్టేసిన బాబు...జగన్ అలా చేస్తారా ఏంటి...?
By: Tupaki Desk | 3 Nov 2022 2:30 AM GMTచంద్రబాబు రాజకీయాల్లో ఇలాంటి తమాషాలు కూడా ఉంటాయి. తాను అధికారంలో ఉంటే చివరి నిముషం దాకా కుర్చీ దిగేది లేదని చెబుతారు. అవతల వారు గద్దె నెక్కితే ప్రమాణం చేసిన మరుసటి రోజు నుంచే యాగీ మొదలెడతారు. ఎన్నికలు అదిగో ఇదిగో అంటూ చెబుతూనే ఉంటారు. నిజానికి ముందస్తు ఎన్నికలు అంటూ చంద్రబాబు 2019 తరువాత నుంచి ఇప్పటికి ఎన్నో సార్లు ప్రకటించి ఉంటారు. లేటెస్ట్ గా ఆయన మరోసారి అలాంటి స్టేట్మెంట్ ఇచ్చేశారు.
ఈసారి దానికి కాస్తా నమ్మకంగా ఉంటుందని రెండు ముహూర్తాలు కూడా చెప్పి మ్యాటర్ వదిలారు. వచ్చే ఏడాది మే నెలలో కానీ లేక డిసెంబర్ లో కానీ ఏపీలో ఎన్నికలు జరిగే చాన్స్ ఉందని బాబు చెప్పుకొచ్చారు. అందువల్ల పార్టీ వర్గాలు అప్రమత్తం కావాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఇదంతా మంగళగిరి పార్టీ ఆఫీసులో ఎన్టీయార్ జిల్లా పార్టీ నేతలతో సమీక్ష నిర్వహిస్తూ బాబు మెరిపించిన మెరుపులు.
నిజంగా అలా ఏపీలో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయా అంటే ఆ తరహా ఆలోచనలు ఏవీ లేవని నిన్నటికి నిన్నే మంత్రి బొత్స సత్యనారాయణ సెలవిచ్చారు. దాని కంటే ముందు అనేక సార్లు సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పి ఉన్నారు. ఇక జగన్ అయితే వచ్చే ఏడాది చివరి దాకా తాము అనుకున్న అభివృద్ధి పనుల అజెండా ఉందని కూడా ప్రకటించారు.
అయినా సరే ముందస్తు అంటున్నారు చంద్రబాబు. అది కూడా మే నెలలో అని చెబుతున్నారు. మే నెల అంటే ఏడాది కాలం పాటు అధికారాన్ని వదిలేసుకుని ముందస్తునకు పోవడం. 151 సీట్లు వచ్చిన తరువాత జనాలు పట్టం కట్టిన తరువాత ఏడాది కాలం వదిలేసుకుని ఎన్నికలకు వెళ్తే అది కచ్చితంగా అధికార పార్టీకి నెగిటివిటీని పెంచే అంశమే అవుతుంది. చేతకాకనే ప్రభుత్వాన్ని వదులుకున్నారు అని జనాలు డిసైడ్ అవుతారు. మరి ఆ విధంగా చేయడానికి వైసీపీ పెద్దలు సిద్ధపడతారా.
అయితే బాబు అన్న దాంటో మరో వైపు కోణం చూస్తే ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయి. వాటిని ఫేస్ చేయలేక ఎన్నికలకు వెళ్లవచ్చు. కానీ దానికైనా కూడా ఎన్నికలకు వెళ్లడం అంటే అది కూడా చేతకాక చాప చుట్టేయడమే అని జనాలు అంటారు. ఇక బాబు ఈ మధ్యకాలమంతా తలవకుండా సడెన్ గా ముందస్తు ప్రకటన చేయడానికి రీజన్ ఏంటి అంటే బీజేపీలో చేరిన మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ క్రిష్ణా రావు తాజాగా ఒక ట్వీట్ ట్వీటారు.
అందులో ఏపీకి అప్పులు ఎక్కువ అయిపోయాయని, ఇక పుట్టే చాన్సే లేదని, అందువల్ల ఎన్నికలకు వెళ్ళడం తప్ప మార్గం లేదని పేర్కొన్నారు. బహుశా అలాంటి సందేశాలు కానీ లేక మరే విధమైన సమాచారం కానీ బాబు వద్ద ఉండి ఉంటే ఈ తరహా ప్రకటనలు చేసి ఉంటారనుకోవాలి. ఏది ఏమైనా ముందస్తు ఎన్నికలకు ఏపీ సర్కార్ వెళ్తుంది అన్నది మాత్రం ఆలోచించాల్సిన విషయమే అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.