Begin typing your search above and press return to search.

ఏపీ ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి హైకోర్టులో ఊరట

By:  Tupaki Desk   |   7 Oct 2021 2:30 PM GMT
ఏపీ ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి హైకోర్టులో ఊరట
X
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నీలం సాహ్ని నియామకం చెల్లదని దాఖలైన పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. విజయనగరం జిల్లాకు చెందిన రేగు మహేశ్వరరావు నీలం సాహ్ని నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

సీఎం సలహాదారుగా పనిచేసిన నీలం సాహ్నిని ఎస్ఈసీగా నియమించడం నిబంధనలకు విరుద్ధమని పిటీషనర్ తరుఫు న్యాయవాది వాదనలు వినిపించారు. నీలం సాహ్నిపై రాజకీయ పార్టీ ప్రభావం ఉంటుందని పిటీషనర్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు.

సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా నియామకం జరిగిందని కోర్టుకు తెలిపారు. అయితే రెండు వర్గాల వాదనలు విన్న హైకోర్టు పిటీషనర్ వాదనలతో ఏకీభవించలేదు. ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకం కరక్టేనని నిర్ధారిస్తూ తీర్పునిచ్చారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన నీలం సాహ్నీ సీనియర్ మోస్ట్ రిటైర్డ్ ఐఎఎస్ ఆఫీసర్. సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను విరుద్ధంగా ఆమెకు ఎన్నికల సంఘం పదవిని ఇచ్చారని పిటీషనర్ పేర్కొన్నారు. ఆమె అనుకూలత.. నియామకం గురించి సందేహాన్ని హైకోర్టులో వ్యక్తం చేశారు.

టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు కూడా నీలాంసాహ్నిని ఈ పదవిలో కొనసాగించడానికి అనుమతించవద్దని డిమాండ్ చేశారు. ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కావడానికి ముందు నీలం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆ తర్వాత సీఎం జగన్ సలహాదారుగా పనిచేశారు.