Begin typing your search above and press return to search.
నిమ్మగడ్డ ఏం చేయనున్నారు.. ఇదే హాట్ టాపిక్
By: Tupaki Desk | 11 Oct 2020 2:51 PM GMTపంచాయితీ, మున్సిపల్ ఎన్నికలు ఏపీలో ఎప్పుడు జరుగుతాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడంపై తాజాగా హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ప్రశ్నించింది.దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై పడింది.
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేమని వైసిపి ప్రభుత్వం కోర్టులో స్పష్టం చేసింది. కోవిడ్ -19 ప్రబలంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమని రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు.
అయితే, అడ్వకేట్ జనరల్ వివరణకు హైకోర్టు అంగీకరించలేదు. వచ్చే నెలలో బీహార్ ఎన్నికలకు సిద్ధమవుతున్నప్పుడు ఏపిలో ఎన్నికలు ఎందుకు నిర్వహించలేమని న్యాయమూర్తులు ప్రశ్నించారు. ఏజి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను మాత్రమే కోర్టుకు తెలియజేశానని వివరించారు. చివరగా హైకోర్టు ఎన్నికల కమిషనర్ స్థానిక ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకోవాలని కోరుతూ నోటీసులు జారీ చేసింది. అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే తుదినిర్ణయం ఎన్నికల కమిషనర్ పై పడింది. ఆయన కోర్టులో బంతి ఉండడంతో నిమ్మగడ్డ ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారింది. హైకోర్టు నోటీసులపై ఎస్‌ఇసి నిమ్మగడ్డ స్పందించాల్సి ఉంది.
కరోనావైరస్ వ్యాప్తిని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ఏకపక్షంగా మార్చిలో ఎన్నికలను వాయిదా వేశారు. అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం.. ఎస్‌ఇసి గొడవ పడుతున్నాయి. పోలింగ్ షెడ్యూల్ కావడానికి కొద్ది రోజుల ముందు తీసుకున్న ఈ నిర్ణయం ఎపి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహానికి కారణమైంది.గవర్నర్‌కు దీనిపై ఫిర్యాదు చేసి రాజ్యాంగ సవరణ చేసి ఆర్డినెన్స్ తెచ్చి నిమ్మగడ్డను తొలిగించారు. ఆ తర్వాత కోర్టు నిర్ణయంతో నిమ్మగడ్డ మళ్లీ ఎస్ఈసీగా నియమితులయ్యారు.
ఇప్పుడు, ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించమని చేతులెత్తేసింది. అయితే ఎస్ఈసీ నిమ్మగడ్డ అంగీకరిస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది. నిమ్మగడ్డ రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇస్తే, అప్పుడు సమస్య లేదు. నిమ్మగడ్డ రాష్ట్ర ప్రభుత్వంతో ఏకీభవించకపోతే మళ్లీ ఇబ్బందులు పెరుగుతాయి.