Begin typing your search above and press return to search.

అంచ‌నాల‌కు భిన్నంగా ఆదివార‌మే షెడ్యూల్ రిలీజ్‌

By:  Tupaki Desk   |   10 March 2019 7:02 AM GMT
అంచ‌నాల‌కు భిన్నంగా ఆదివార‌మే షెడ్యూల్ రిలీజ్‌
X
దేశం మొత్తం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ఎన్నిక‌ల షెడ్యూల్ అంచ‌నాల‌కు భిన్నంగా వెలువ‌డ‌నుందా? అంటే అవున‌ని చెబుతున్నారు. ముందుగా అనుకున్న దాని ప్ర‌కారం శ‌నివారం సాయంత్రం లేదంటే.. సోమ‌వారం ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌వుతుంద‌ని అంతా భావించారు. అందుకు త‌గ్గ‌ట్లే రాజ‌కీయ పార్టీలు సిద్ధ‌మ‌వుతున్నాయి.

ఇదిలా ఉంటే.. ఈ రోజు (ఆదివారం) సాయంత్రం కేంద్ర ఎన్నిక‌ల సంఘం మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేయ‌నున్న‌ట్లుగా స‌మాచారం అందింది. దీంతో.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల షెడ్యూల్ తో పాటు.. నాలుగు రాష్ట్రాల్లో జ‌రగాల్సిన అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ డేట్స్ ప్ర‌క‌టించే వీలుంద‌ని చెబుతున్నారు. ఈ సాయంత్రం ఐదు గంట‌లకు ఎన్నిక‌ల షెడ్యూల్ ను విడుద‌ల కానుంది. దీంతో.. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చేస్తుంది. ఇప్పుడున్న అంచ‌నాల ప్ర‌కారం ఏప్రిల్ మొద‌టి వారంలో తొలి పోలింగ్ జ‌రుగుతుంద‌ని.. జూన్ 3కు ముందే కేంద్రంలో కొత్త స‌ర్కారు కొలువు తీర‌నున్న‌ట్లు తెలుస్తుంది.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌.. ఒడిశా.. సిక్కిం.. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రాల‌కు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. క‌శ్మీర్ రాష్ట్రంలోనూ అసెంబ్లీ ఎన్నిక‌లు నిర్వ‌హించాలా? వ‌ద్దా? అన్న విష‌యంపై చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ విష‌యంలో ఈసీ చ‌ర్చ‌ల మీద చ‌ర్చ‌లు జ‌రుపుతోంది.