Begin typing your search above and press return to search.
మంత్రుల కమిటీతో భేటీపై ఏపీ ఉద్యోగులు ఏమన్నారు?
By: Tupaki Desk | 28 July 2022 7:11 AM GMTగడిచిన కొంతకాలంగా ఏపీ ప్రభుత్వానికి.. ప్రభుత్వ ఉద్యోగులకు మధ్య సుహృద్భావ వాతావరణం లేదనే చెప్పాలి. అదే పనిగా విరుచుకుపడే విపక్షాలకు షాకుల మీద షాకులు ఇస్తూ.. నోరు విప్పాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకునేలా చేసిన జగన్ సర్కారుకు తమ ఆందోళనతో షాకిచ్చిన క్రెడిట్ ఏపీ ఉద్యోగులకే దక్కిందని చెప్పాలి.
జగన్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎంత ఉందన్న విషయాన్ని తెలియజెప్పేలా ఏపీ ఉద్యోగుల ఆందోళన జరిగిందన్నమాట ఇప్పటికి వినిపిస్తూ ఉండటమే కాదు.. ఏపీ రాష్ట్ర చరిత్రలో సదరు ఆందోళన ఎప్పటికి మర్చిపోలేమన్న మాట వినిపిస్తుంటుంది. ఉద్యోగ సంఘాల చరిత్రలో ఈ తరహా నిరసన ఎప్పుడూ చేయలేదన్న మాట వినిపిస్తూ ఉంటుంది. ఇలా జగన్ సర్కారుకు షాకిచ్చిన ఉద్యోగ సంఘాలకు.. ప్రభుత్వ ఉద్యోగులకు తర్వాత నుంచి ‘సినిమా’ షురూ అయ్యిందన్న మాట వినిపిస్తోంది.
మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వానికి.. ప్రభుత్వ ఉద్యోగులకు సరైన టర్మ్స్ లేని నేపథ్యంలో.. ఆ దూరాన్ని తగ్గించేందుకు వీలుగా మంత్రులతో కమిటీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అసలేం జరిగింది? వారి మధ్య ఏయే అంశాల మీద చర్చ జరిగింది? ప్రభుత్వం మీద ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఎలా రియాక్టు అయ్యిందన్న విషయానికి వస్తే..
మంత్రుల కమిటీతో చర్చ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ స్కీం మీదన ఎక్కువ చర్చ జరిగినట్లుగా ఏపీ ఉద్యోగులు చెబుతున్నారు. ఆరోగ్య శ్రీను ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రైవేటు ఆసుపత్రుల్లోతీసుకుంటున్న విషయాన్ని ప్రస్తావించినట్లుగా పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే హెల్త్ స్కీంను అమలు చేస్తున్నారో.. అదే రీతిలో అమలు చేయాలన్న విషయాన్ని స్పష్టం చేసినట్లుగా వెల్లడించారు. దీనిపై మంత్రుల కమిటీ హామీ ఇచ్చిందన్నారు. ఇతర రాష్ట్రాల మాదిరే ఏపీ ప్రభుత్వం కూడా అమలు చేస్తున్నట్లుగా మంత్రులు హామీ ఇచ్చినట్లు తెలిసింది.
సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కాంట్రాక్టు.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల అంశం మీద కూడా మంత్రుల కమిటీతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రుల కమిటీ స్పందించి.. త్వరలోనే పరిష్కారం చూపిస్తామన్నారు. అదే సమయంలో వర్సిటీ కాలేజీల్లో పని చేసే వారికి 62 ఏళ్లకు సర్వీసు పెంచాలన్న అంశంపై స్పందిస్తూ.. త్వరలోనే జీవో జారీ చేయనున్నట్లుగా చెబుతున్నారు. జీపీఎఫ్ మొత్తాన్ని జులైన చివరి నాటికి ఉద్యోగుల ఖాతాల్లో వేస్తామని మంత్రుల కమిటీ చెప్పినట్లుగా ఏపీ ఉద్యోగ సంఘాల నాయకుడు బండి శ్రీనివాసరావు వెల్లడించారు.
ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం మీదా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఘాటు వ్యాఖ్యలు చేశారు. జీపీఎఫ్ లోన్ పెట్టుకుంటే సరైన సమయానికి రావటం లేదన్నారు. ‘‘కూతురు పెళ్లికి జీపీఎఫ్ పెట్టుకుంటే మనమరాలు పుట్టిన రోజుకు.. బారసాలకు లోన్ వస్తుంది’ అని ప్రభుత్వ తీరును అందరికి అర్థమయ్యేలా చురకలు వేశారు. గ్రామ సచివాలయంలోని ఉద్యోగుల్లో కొందరిని రెగ్యులరేజ్ చేసిన వైనాన్ని చెప్పారు.
ఆరోగ్య శాఖకు సంబంధించి 54 డిమాండ్ల మీద శుక్రవారం మరోసారి సమావేశం కానున్నట్లు వెల్లడించారు. మొత్తంగా ప్రభుత్వం తీరుపై తమ మనసులోని మాటల్నిచెప్పేందుకు ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు పెద్దగా మొహమాట పడలేదన్న మాట వినిపిస్తోంది.