Begin typing your search above and press return to search.
తగ్గేది లేదంటున్న ఉద్యోగులు...ఏం చేద్దాం...?
By: Tupaki Desk | 13 Jan 2022 12:30 PM GMTఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు ఒక్క లెక్కన గుస్సా అవుతున్నారు. పండుగ పూట జగన్ శుభవార్త వినిపించాను అనుకున్నారు. కానీ కొత్త పీయార్సీ వల్ల మాకు ఏమీ మేలు జరగలేదు అంటున్నారు వారు. నిజానికి పీయార్సీ రివర్స్ గేర్ వేస్తోందని కూడా కామెంట్స్ చేస్తున్నారు. థర్టీ పర్సెంట్ ఫిట్ మెంట్ ఇస్తేనే తప్ప తాము ఒప్పుకునేది లేదు అని కూడా చెప్పేస్తున్నారు. మొత్తానికి కధ మళ్ళీ మొదటికి వచ్చినట్లుగా ఉంది.
చాలారకాలైన డిమాండ్లు తమకు ఉన్నాయని వాటిని అన్నింటినీ జగన్ ప్రభుత్వం పరిష్కరించాల్సిందే అంటున్నారు. లేకపోతే ఉద్యమ బాట పడతామని కూడా తేల్చి చెబుతున్నారు. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు ముప్పయి శాతం ఫిట్మెంట్ ఇవ్వాలీ కంటే ఖజానా మీద కచ్చితంగా మరో అయిదారు వేల భారం ఏటా పడుతుంది.
దాంతో అన్నీ అర్ధం చేసుకోవాలనే ప్రభుత్వం చెప్పి 23 శాతానికి ఒప్పించింది. అయితే ఉద్యోగ సంఘాల నేతలకు ఓకేగా ఉన్నా ఉద్యోగులు మాత్రం ససేమిరా అంటున్నారు. దీనికి తోడు ఉద్యోగ సంఘాల మధ్య చీలిక కూడా వచ్చేసింది. తమ డిమాండ్ల విషయంలో ప్రభుత్వం ఏమీ పట్టించుకోలేదు అని కూడా వారు మండుతున్నారు. యూనియన్లతో ప్రమేయమే లేకుండా ఉద్యోగులే వీధుల్లోకి వచ్చి మరీ నిరసన తెలియచేస్తున్నారు.
ప్రభుత్వం హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగులకు ఇచ్చే భత్యాలు కొనసాగించాలని, వేతన సవరణ సంఘం సిఫారసు చేసినట్లుగా ఇంటి అద్దె భత్యం, సీసీఏలు కూడా యధాతధంగా కొనసాగించాలని కోరుతున్నారు. ఇక డెబ్బై నుంచి డెబ్బై తొమ్మిది ఏళ్ళ మధ్య ఉన్న పెన్షనర్లకు అదనంగా పది శాతం పెన్షన్ ఇవ్వాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇవే కాకుండా ఇంకా మిగిలిపోయిన అనేక ఆర్ధిక అంశాలను తేల్చాలని కూడా కోరుతున్నారు. మొత్తానికి ఉద్యోగులు భారీ షాకే సర్కార్ కి ఇచ్చేశారు అంటున్నారు. అదే విధంగా చూసుకుంటే ఏపీలో ఆర్ధిక పరిస్థితి ఏ మాత్రం బాగులేదు. ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన పీయార్సీ మేరకు ఏటా పదివేల కోట్లు అదనంగా అవుతుంది. దానికి తోడు ఇపుడు 30 శాతం ఫిట్మెంట్ అంటే అది భారమే అవుతుంది.
దాంతో ప్రభుత్వం ముందూ వెనకాడే సీన్ ఉంది. అయితే ఉద్యోగులు అసలు తగ్గేది లేదు అంటున్నారు కాబట్టి వారు కోరుకున్న విధంగా చేయకపోతే రేపటి రోజున చెడ్డ అవుతారు. అది రాజకీయంగా కూడా ప్రభుత్వానికి మంచిది కాదు అన్న మాట వినిపిస్తోంది. దీంతో ఏం జరుగుతుంది అన్న చర్చ అయితే గట్టిగానే ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.