Begin typing your search above and press return to search.
ఆరు నూరు అయినా... ఆరవ తేదీ అర్ధ రాత్రి నుంచి.... ?
By: Tupaki Desk | 21 Jan 2022 10:35 AM GMTమొత్తానికి అటూ ఇటూ డెసిషన్స్ తీసేసుకున్నారు. ఇక కొత్త పీయార్సీ విషయంలో తాము న్యాయమే చేశామని, ఉద్యోగులే ఆలోచించుకోవాలని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలిచి కొత్త పీయార్సీ మీద నచ్చచెప్పడానికి ప్రభుత్వం మంత్రులతో ఒక కమిటీని తాజాగా నియమించింది. ఆ కమిటీలో మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణా రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉన్నారు.
మరి ఈ కమిటీ ముందుకు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చర్చలకు వస్తాయా అన్నది చూడాలి. ఇంకో వైపు చూస్తే ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు అన్నీ కూడా సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించారు. ఇక సమరమే అంటూ గర్జిస్తున్నాయి. సమ్మెకే వెళ్తామని కూడా చెబుతున్నాయి. వచ్చే నెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి ఏపీలోని పదమూడు లక్షల మంది ఉద్యోగులు అంతా సమ్మె బాట పట్టనున్నారు.
ఇక ఈ నెల 24న ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాయి. ఇక 23 నుంచి ఆందోళన జోరు పెంచాలని కూడా నిర్ణయించారు. 23న అన్ని జిల్లా కేంద్రాలలో రౌండ్ టేబిల్ సమావేశాలు నిర్వహిస్తారు. 25న జిల్లా కేంద్రాలలో ధర్నాలు ర్యాలీలు ఉంటాయి. 26న అన్ని తాలూకా కేంద్రాలలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పిస్తారు. 27 నుంచి 30న్ వరకూ అన్ని జిల్లా కేంద్రాలలో నిరాహారదీక్షలు చేస్తారు. ఫిబ్రవరి 3న చలో విజయవాడ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడతారు. ఇక 5 నుంచి సహాయ నిరాకరణ కార్యక్రమంతో మొదలుపెట్టి ఆరవ తేదీ అర్ధ రాత్రి నుంచి పూస్తి స్థాయిలో సమ్మెకు వెళ్తారు.
ఇక చూస్తూంటే పీయార్సీ విషయంలో ప్రభుత్వం దిగి వచ్చేంతవరకూ ఎక్కడా తగ్గకూడదని ఉద్యోగ సంఘాలు అన్నీ నిర్ణయం తీసుకోవడం విశేషం. దాంతో ఈ కీలకమైన సమయాన ఉద్యోగుల వైపు నుంచి చర్చలకు వెళ్తారా అన్న సందేహాలు ఉన్నాయి. పీయార్సీ మీద పునరాలోచిస్తామని ప్రభుత్వం నుంచి హామీ ఉంటేనే చర్చలు తప్ప లేకపోతే పిలిచినా వెళ్ళమని ఉద్యోగ నాయకులు అంటున్నారు. ఇక ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీ కొత్త పీయార్సీ మీద నచ్చచెప్పడానికి తప్ప పునరాలోచనకు కాదు అంటున్నారు. అంటే అటూ ఇటూ గట్టిగానే ఉన్నారన్న మాట.
ఈ నేపధ్యంలో సమ్మె జరగడం అనివార్యంగా ఉంది. ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయి అన్నది కూడా చూడాలి మరి. ఏది ఏమైనా ఉద్యోగులు, ప్రభుత్వం కూడా ఎవరికి వారు తమదే కరెక్ట్ వాదన అని ఈ దశలో ఉండడం వల్ల ఆరు నూరు అయినా ఆరవతేదీ అర్ధరాత్రి నుంచి సమ్మె అనివార్యం అనే అంటున్నారు.