Begin typing your search above and press return to search.
ఒకేసారి నాలుగు మెట్లు....ఉద్యోగులు రెడీనా...?
By: Tupaki Desk | 27 Jan 2022 5:30 PM GMTప్రభుత్వం వర్సెస్ ఉద్యోగులు అన్నట్లుగా ఉన్న సీన్ కాస్తా కొత్త మలుపు తీసుకోనుందా అంటే ఏమో పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఉద్యోగులు సమ్మె బాట పడితే మాత్రం వెనక్కి తీసుకురావడం ఎవరి వల్ల కాదు, అందుకే దాని కంటే ముందే ప్రభుత్వం పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నట్లుగా సంకేతాలు ఇస్తోంది. మేము ఒకటి కాదు నాలుగు మెట్లు ఒకేసారి దిగుతామని కూడా చెబుతోంది. మరి దిగబోతున్న ఆ మెట్లు ఏంటో, వాటి వల్ల ఉద్యోగులకు జరిగే మేలు ఏంటో కూడా ఆలోచించాలి.
పీయార్సీకి సంబంధించి ఫిట్ మెంట్ తక్కువ ఇచ్చినా ఉద్యోగులు కొంత తగ్గారు. ఎపుడైతే హెచ్ ఆర్ ఏ విషయంలో ప్రభుత్వం భారీగా కోత పెట్టిందో ఇక తట్టుకోలేకపోయారు. అలాగే అనేక ఆర్ధిక ప్రయోజనాలకూ చెక్ పెట్టేశారు. ఈ పరిణామాల మీద ఆవేశపడిన ఉద్యోగులు ఆగమేఘాల మీద సమ్మెకు రెడీ అంటూ అంతా ప్రిపేర్ చేశారు. ఇపుడు ప్రభుత్వ ఉద్యోగుల తీరు చూస్తూంటే ఆరు నూరు అయినా సమ్మెకి సిద్ధమని అన్నట్లుగానే ఉంది.
మరి ఈ సమయంలో ప్రభుత్వం ఏం చేయాలి. ఉద్యోగుల సైడ్ ఫుల్ క్లారిటీగా ఉంది. అందుకే ప్రభుత్వమే ఇపుడు మెట్లు దిగాల్సి ఉంది అంటున్నారు. ఆ దిశగానే తాము అడుగులు వేస్తున్నామని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామక్రిష్ణారెడ్డి చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు తమకు శత్రువులు కాదు, వారంతా ప్రభుత్వంలో భాగమని కూడా సజ్జల చెబుతున్నారు.
చర్చలకు ఉద్యోగులు రావాలని ఆయన కోరుతున్నారు. ఎపుడైనా చర్చలే పరిష్కారం అవుతాయని, వాటిని కాదంటే ఎలా అని కూడా అంటున్నారు. తాము ఇక మీదట రోజుకు పన్నెండు గంటలూ అందుబాటులో ఉంటామని కూడా చెబుతున్నారు. ఉద్యోగ సంఘాల నేతలే కాదు, ఉద్యోగులు ఎవరు వచ్చినా తాము చర్చిస్తామని కూడా అంటున్నారు.
ఉద్యోగులు బెట్టు వీడాలని ఆయన సూచిస్తున్నారు. మరో వైపు సమ్మె వైపుగా ఉద్యోగులు వెళ్లకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ తీసుకుంటామని కూడా ఆయన చెబుతున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇక్కడే ఉద్యోగులు పెద్ద డౌట్లు వ్యక్తం చేస్తున్నారు. నాలుగు మెట్లు దిగుతామని చెబుతున్నారు కదా, జీవోలు రద్దు, పీయార్సీని రద్దు చేయడం అనే రెండు మెట్లు దిగితే సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది కదా అని కూడా చెబుతున్నారు.
మరి ప్రభుత్వం మాత్రం చర్చలకు రావాలని అక్కడే అన్నీ మాట్లాడాలని అంటోంది. మరో వైపు కొత్త పీయార్సీ మీద జీతాలు ఇవ్వమని చెబుతున్న ప్రభుత్వాన్ని నమ్మడం ఎలా అన్న డౌట్లు ఉద్యోగ వర్గాల నుంచి వస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం స్పష్టం అవుతోంది. ప్రభుత్వం గతంలో ఉన్నంత పట్టుదలను ఇపుడు ఎంతో కొంత సడలించుకుంది అంటున్నారు. అయితే అది పూర్తిగానా లేక ఎంత శాతం అన్నదే చూడాలి. మరి కొద్ది రోజులు ఉద్యోగులు ఆందోళనలోనే ఉంటే సర్కార్ పూర్తిగా దిగివస్తుంది అన్న నమ్మకం అయితే ఉద్యోగులలో ఉంది అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.