Begin typing your search above and press return to search.
మండిపోతున్న ఉద్యోగుల మీద పన్నీటి వాన...?
By: Tupaki Desk | 31 Jan 2022 11:33 AM GMTఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు మండిపోతున్నారు. వారి మంటకు అనేక కారణాలు ఉన్నాయి. అన్నింటికీ మించి తాము కోరుకున్న ప్రభుత్వం, తాము ముఖ్యమంత్రి కావాలని తపించిన నేత తమను ఇలా రోడ్ల పాలు చేశాడు అన్న బాధ వారిలో వర్ణనాతీతం. మిగిలిన ముఖ్యమంత్రుల తీరు వేరు, జగన్ విషయం వేరు. ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆయనే మా సీఎం అని అనుకుని మరీ ఏలికగా తెచ్చుకున్నారు. అందుకే వాళ్లు జగన్ అధికారంలోకి వచ్చిన మూడేళ్ళ దాకా కూడా పెద్దగా కొత్త పీయార్సీ మీద వత్తిడి చేయలేదు.
అయితే సర్కార్ పెద్దలు దాన్ని అలా నానుస్తూ పోతున్నారు అన్న ఆవేదనతోనే చర్చలకు దిగారు, ఇక ఆ చర్చలు కూడా ఎన్నో దఫాలుగా సాగాయి. చివరికి ఐఆర్ కంటే ఫిట్మెంట్ తక్కువగా ఉన్నా ఆర్ధిక కారణాలు చూసి కొంత తగ్గుదామనుకున్నా హెచ్ ఆర్ ఏ లో భారీ కోతతో పాటు, ఇతర బెనిఫిట్స్ కూడా కోతేయడంతో వారు ఆగ్రహం చెందారు. దాంతోనే సమ్మె బాట పడుతున్నారు.
అయినా ఈ రోజుకు కూడా ప్రభుత్వం విషయంలో తాము ఇంకా పాజిటివ్ గానే ఉంటామని, తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే కోరుతున్నారు. ఇదిలా ఉంటే ఉద్యోగులకు కోరని వరం ఒకటి జగన్ చర్చల సందర్భంగా ఇచ్చారు. అదేంటి అంటే 60 నుంచి 62 ఏళ్లకు పదవీ విరమణ వయసు పెంచడం. దాని వల్ల మరో రెండేళ్ల పాటు హాయిగా ప్రభుత్వ ఉద్యోగాల్లో కొనసాగవచ్చు.
అయితే ఇది జరిగిన తరువాత ఉద్యోగులు సమ్మె బాటన నడవడంతో ప్రభుత్వం దీన్ని అమలు చేస్తుందా అన్న డౌట్లు అయితే ఉద్యోగులకు కలిగాయి. కానీ జగన్ సర్కార్ మాత్రం ఎలాంటి రెండవ ఆలోచన లేకుండా పదవీ విరమణ వయసుని పెంచుతూ దాన్ని మంత్రివర్గంలో ఆమోదించింది. గవర్నర్ ఆమోదానికి పంపించింది. అక్కడ ఈ రోజు ఆమోదముద్ర పడింది. ప్రభుత్వం పంపించిన ఫైల్ మీద గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సంతకం చేశారు.
దాంతో ఈ ఏడాది జనవరి 1 నుంచి కొత్తగా పెంచిన రిటైర్మెంట్ వయసు ఉత్తర్వు అమలులోకి వస్తుంది. అంటే జనవరి 1న పదవీవిరమణ చేసిన వారు కూడా తిరిగి విధులలో జాయిన్ కావచ్చు అన్న మాట. మొత్తానికి ఈ కీలక నిర్ణయంతో ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తాము కోరని డిమాండ్ నెరవేర్చి జగన్ మంచి పని చేశారని అంటున్నారు.
దాంతో మండుతున్న వారి కోపానికి ఈ విధంగా జగన్ పన్నీటి జల్లు జల్లారని అంటున్నారు. అయితే కధ ఇంతటితో ఆగదని, తమకు కొత్త పీయార్సీని రద్దు చేసి పాత జీతాలు ఇవ్వాలన్న డిమాండ్ నుంచి వెనక్కు జరగమని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. ప్రభుత్వం అయితే కొత్త జీతాలే ఇస్తామని మళ్ళీ మళ్ళీ చెబుతోంది. మరి జగన్ అడగని వరం ఇచ్చి ఉద్యోగులకు మంచి అయ్యారా. అడిగిన వాటిని పట్టించుకోకుందా చెడ్డ అవుతున్నారా అంటే ఈ ప్రశ్నకు బహుశా సమాధానం వెంటనే ఎవరూ చెప్పలేరేమో.