Begin typing your search above and press return to search.

రావాలి జగన్.. కావాలి జగన్... ?

By:  Tupaki Desk   |   3 Feb 2022 4:48 PM GMT
రావాలి జగన్.. కావాలి జగన్... ?
X
అవును. జగనే ఇపుడు కావాలి. ఆయనే రావాలి. ఇది మూడేళ్ళ క్రితం పాదయాత్ర వేళ పుట్టిన నినాదం కాదు, జగన్ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు అంటున్న మాట. జగన్ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి బయటకు రావాలి. ఆయన మా గోడు వినాలి. ఆయన మా సమస్యలు పట్టించుకోవాలి. జగన్ ఉద్యోగులతో నేరుగా చర్చలు జరపాలి. ఇదీ ప్రభుత్వ ఉద్యోగుల లేటెస్ట్ డిమాండ్. మొతానికి జగన్ కి అచ్చి వచ్చిన నినాదాన్నే ఉద్యోగులు రివర్స్ లో అందిపుచ్చుకున్నారు.

జగన్ తో తప్ప మేము ఎవరితో చర్చలు జరపం, పిలిచినా రాము ఇది వారి సరికొత్త కండిషన్. వైసీపీ సర్కార్ అయితే ఉద్యోగులతో చర్చలకు మంత్రులతో కమిటీని వేసింది. ఆ కమిటీతో చర్చలకు రావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ నుంచి చాలా మంది పిలుస్తున్నారు.

అయితే చర్చలు అంటూ మేము జరిపితే సీఎం సార్ తోనే. జగన్ తోనే డైరెక్ట్ గా మాట్లాడుతాం, ముఖ్యమంత్రి ఈ విషయంలో చర్చలకు మమ్మల్ని పిలవాలి అని పాయార్సీ సాధన సమితి నేత బండి శ్రీనివాసరావు అంటున్నారు. జగన్ ఈ విషయంలో చొరవ చూపాలని కూడా కోరుతున్నారు.

ఇక్కడ ఒక విషయం స్పష్టం. ఉద్యోగులు దిగిరారు, వారి బలం ఏంటో కూడా చూపించారు. ఇక వారి డిమాండ్లు కూడా తేటతెల్లంగా చెప్పేశారు. జగన్ని సలహాదారులే తప్పుదోవ పట్టిస్తున్నారు అన్నది ఉద్యోగుల అభియోగంగా ఉంది. దాంతో జగన్ తోనే తమ సమస్యల మీద తేల్చుకుంటామని వారు అంటున్నారు. మరి జగన్ ఈ విషయమో ఏమంటారో చూడాలి.

ఇప్పటిదాకా మంత్రుల కమిటీతోనే చర్చలు అన్నారు. అయితే అది చాలదు అని ఉద్యోగులు అంటున్నారు. మరి జగన్ తో చర్చలు అంటే ఉద్యోగుల ప్రధాన డిమాండ్ల మీద ముఖ్యమంత్రి అంగీకరించే రావాల్సి ఉంటుంది. లేకపోతే సీఎం స్థాయిలో చర్చలు అయినా విఫలం అవక తప్పదు. మొత్తానికి చూస్తే ఉద్యోగులు ఒడుపుగా బంతిని జగన్ కోర్టులోకి నెట్టారు. మరి దాని మీద జగన్ ఏమంటారో.