Begin typing your search above and press return to search.

ఉద్యోగుల చీక‌టి ఒప్పందంలో నిజాలు ఇవే!

By:  Tupaki Desk   |   8 Feb 2022 4:30 PM GMT
ఉద్యోగుల చీక‌టి ఒప్పందంలో నిజాలు ఇవే!
X
ఉద్యోగులు చేప‌ట్టిన పీఆర్సీ ఉద్య‌మం విష‌యంలో స‌ర్కారు వ్య‌వ‌హ‌రించిన తీరు అంద‌రికీ తెలిసిందే. చ‌ర్చ‌ల‌తో స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయంటూ.. ఉద్యోగుల‌తో ప‌దే ప‌దే చ‌ర్చ‌లు చేసింది. ఇది మంచిదే ఏ స‌మ‌స్య‌కైనా కూడా చ‌ర్చ‌ల ద్వారా ప‌రిష్కారాలు చూపడం స‌మంజ‌స‌మే. అయితే..ఈ చ‌ర్చ‌ల పేరుతో.. ఉద్యోగులు ప్ర‌బుత్వంతో చీక‌టి ఒప్పందాలు చేసుకున్నార‌నే వాద‌న వినిపిస్తుండ‌డ‌మే ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. దీనికి సంబంధించి ఉపాధ్యాయ యూనియ‌న్ నేత జీ. హృద‌య‌రాజు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని విష‌యాలు వెలుగులోకి తెచ్చారు.

తాము 4వ తేదీన ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు జ‌రిపిన‌ప్పుడు.. ప్ర‌ధానంగా పీఆర్సీపైనే ప‌ట్టుబ‌ట్టామ‌ని.. అదేస‌మ‌యంలో ఫిట్‌మెంట్‌ను 23 కాదు ఐఆర్‌తో స‌మానంగా 27 శాతం ఇవ్వాల‌ని కోరామ‌ని ... దీనికి ప్ర‌భుత్వం అంగీక‌రించింద‌ని.. అయితే.. 5వ తేదీ చ‌ర్చ‌ల నాటికి అంతా సీన్ మారిపోయింద‌ని హృద‌య రాజు అన్నారు. చ‌ర్చ‌ల కోసం వెళ్లిన తాము.. ముందు ఫిట్‌మెంట్‌పై మాట్లాడాల‌నిఅంటే.. మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌, సీఎస్ స‌మీర్ శ‌ర్మ‌లు.. దీనిపై చివ‌రిలో చ‌ర్చిస్తామ‌ని అన్నార‌ని చెప్పారు. ఈ స‌మ‌యంలో ఉద్యోగ సంఘాల జేఏసీ నేత‌లను దీనిపై ప‌ట్టుబ‌ట్టాల‌ని కోరామ‌ని.. అయితే..వారు మంత్రి చెప్పారు కదా.. తొంద‌ర ఎందుకు? అని కాల‌యాప‌న చేసిన‌ట్టు తెలిపారు.

దీంతో కీల‌క‌మైన ఫిట్‌మెంట్ అంశం.. తెర‌మ‌రుగు అయింద‌ని.. దీనివ‌ల్ల ఉద్యోగులు భారీ ఎత్తున జీతాలు న‌ష్ట‌పోయే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని తెలిపారు. అదేవిధంగా ఔట్ సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగుల అంశాన్ని కూడా లేవ‌నెత్తాల‌ని తాము చెబితే.. మంత్రులు ఎదురు దాడి చేశార‌ని.. ఇది మాకు సంబంధించిన అంశం కాద‌న్నార‌ని.. అయితే.. ఇది త‌మ‌కు సంబంధించిన అంశ‌మేనని తాము చెప్పినా.. ఇతర నేత‌లు మాత్రం స్పందించ‌లేద‌ని అందుకే ఈ విష‌యం కూడా తెర‌మ‌రుగు అయింద‌న్నారు. పైగా ఉద్యోగ సంఘాల నాయ‌కులే.. ఉపాధ్యాయుల‌ను చిన్న‌చూపు చూసేలా.. ఉద్యోగ సంఘాల నాయ‌కులే వ్యాఖ్యానాలు చేశార‌ని అన్నారు.

ఉపాధ్యాయ నేత‌లు హీరోలా.. అన్నార‌ని.. వారు చేస్తున్న‌ది టీ క‌ప్పులో తుఫాన్ వంటిదేన‌ని.. దానిని పెద్ద‌గా ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని.. ఎలా వ్యాఖ్యానిస్తార‌ని.. ఇలాంటి వ్యాఖ్య‌ల వెనుక ఏదో జ‌రిగింద‌ని అంటే త‌ప్పేముంద‌ని హృద‌య‌రాజు ప్ర‌శ్నించారు. చ‌లో విజ‌య‌వాడ కు ల‌క్ష‌న్న‌ర మంది ఉపాధ్యాయ‌లు, ఉద్యోగులు హాజ‌ర‌య్యార‌ని.. వారి క‌ష్టాన్ని ప్ర‌భుత్వానికి తాక‌ట్టు పెడ‌తామా? అని ఆయ‌న నిల‌దీశారు.

అంతేకాదు.. ఉపాధ్యాయులు.. క‌లెక్ట‌రేట్ల‌ను ముట్ట‌డించార‌ని.. ఈ క‌ష్టాన్ని కూడా మ‌నం మ‌రిచిపోదామా? అని ప్ర‌శ్నించారు. ఏదో జ‌రిగింద‌న‌డానికి ఇదే ఉదాహ‌ర‌ణ‌ల‌ని.. ఇంత క‌ష్ట‌ప‌డి కేవ‌లం 2శాతం హెచ్చార్ పెంచుకుని ఏం చసాధించిన‌ట్ట‌ని ఆయ‌న అన్నారు.