Begin typing your search above and press return to search.

ఆ నలుగురూ సౌండిచ్చారు...ఫైర్ అయ్యారు...

By:  Tupaki Desk   |   9 Feb 2022 4:40 PM GMT
ఆ నలుగురూ సౌండిచ్చారు...ఫైర్ అయ్యారు...
X
ఆ నలుగురూ ఇపుడు ఏపీలో ట్రెండీ టాపిక్ గా మారింది. ఇంతకీ ఎవరా నలుగురు, ఏమా కధ అంటే వారే పీయార్సీ సాధన కమిటీలో స్టీరింగ్ తిప్పిన కీలక నేతలు. బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాసరావు, వెంకటరామిరెడ్డి, సూర్యానారాయణ మీడియా ముందుకు వచ్చి మరీ ఉపాధ్యాయ సంఘాల నేతల మీద ఫైర్ అయ్యారు. అనాడు కలసి కూర్చుని మరీ సమ్మె విరమిద్దామంటే సరే అని చెప్పి ఇపుడు రివర్స్ అవుతోంది మీరు కాదా మాస్టార్లూ అంటూ ఉపాధ్యాయ నేతల మీద ఆరోపణలు గుప్పించారు.

మీ వెనక ఎవరో ఉన్నారు, అందుకే ఇలా మాట్లాడుతున్నారు అంటూ కొత్త డౌట్లు కూడా రేకెత్తించారు. వేరే శక్తుల ప్రభావంతోనే ఇలా వ్యవహరిస్తున్నారు అంటూ ఉపాధ్యాయ సంఘ నేతల మీద గుస్సా అయ్యారు. ఉద్యమంలో ఉన్నపుడు అన్నీ భరించాల్సిందే అని కూడా వారు అనడం గమనార్హం.

ఇక కొత్త పీయార్సీలో అనుకున్న ఫిట్మెంట్ తప్ప దాదాపుగా అన్నీ సాధించామని వారు చెప్పుకొచ్చారు. పదేళ్ళకు ఒకసారి పీయార్సీ అంటే అలా కాదని అయిదేళ్ళకే దాన్ని సవరించేలా చేశామని చెప్పుకున్నారు. తెలనాణాతో సమానంగా హెచ్ ఆర్ సీని సాధించామని కూడా వివరించారు. ఇక ఫిట్మెంట్ అనుకున్నత సాధించలేదన్న బాధ తమకూ ఉందని, అయితే ఉన్నంతలో మేలు చేశామని భావిస్తున్నామని అన్నారు.

మరో వైపు చూస్తే తమను టార్గెట్ చేయడం, వాట్సప్ సందేశాలు తమకు పంపడం ద్వారా నిందించాలనుకోవడం మంచిది కాదని అన్నారు. పీయార్సీ ద్వారా వచ్చినవి తమ ఘనతని చెప్పుకుని ఇక లేనివీ, రానివి ఉద్యోగ సంఘ నేతల తప్పిదమని మాట్లాడడం టీచర్ యూనియర్స్ కి తగునా అని నిలదీశారు.

ఇక తాజా ఒప్పందం నచ్చకపోతే ఆరవ తేదీ అర్ధ రాత్రి నుంచి సమ్మెకు వెళ్లి ఉండాల్సింది కదా అలా ఎందుకు చేయలేదు అంటూ కూడా ఆ నలుగురూ ప్రశ్నించారు. మొత్తానికి చూస్తే తమను టార్గెట్ చేస్తే ఊరుకునేది లేదని మాత్రం ఈ నలురుగు కీలక నేతలూ టీచర్ యూనియన్స్ కి గట్టిగానే చెబుతున్నారు. ఇపుడు పీయార్సీ ఒప్పందం కధ కొత్త మలుపు తీసుకుందనే చెప్పాలేమో.