Begin typing your search above and press return to search.

పోస్టింగ్ కోసం కోర్టు మెట్లు ఎక్కిన ఏపీ ఉద్యోగులు

By:  Tupaki Desk   |   16 Nov 2021 2:30 AM GMT
పోస్టింగ్ కోసం కోర్టు మెట్లు ఎక్కిన ఏపీ ఉద్యోగులు
X
అడకత్తెరలో పోకచక్కలా నలిగిపోతున్నారు ఉద్యోగులు.. రెండు తెలుగు రాష్ట్రాల విభజనతో ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ అయిన ఉద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఏపీ నుంచి తెలంగాణ బదిలీ అయిన ఉద్యోగులు తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

జులై 14న సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం పోస్టింగ్ ఇవ్వలేదని పిటీషన్ వేసిన ఏపీ ఉద్యోగులు.. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ డిసెంబర్ 3లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది.

అఫిడవిట్ వేయకపోతే ప్రతివాదులంతా కోర్టు రావాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది. డిసెంబర్ 8న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.

ఆగస్టులో ఏపీ నుంచి తెలంగాణకు ఉద్యోగుల ప్రక్రియ జరిగింది. దీనిపై ఇప్పటివరకు జగన్ సర్కార్ నిర్ణయం తీసుకోలేదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఇప్పటికైనా తమను తెలంగాణ నుంచి ఏపీకి బదిలీ చేయాలని.. లేదా సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం పోస్టింగ్ ఇవ్వాలని వారు కోరుతున్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని ఉద్యోగులు తెలిపారు.