Begin typing your search above and press return to search.
బ్రేకింగ్: ఏపీలో మోగిన సమ్మె సైరెన్
By: Tupaki Desk | 24 Jan 2022 11:30 AM GMTఅనుకున్నట్టే అయ్యింది.. ఏపీ ఉద్యోగులు సమ్మె సైరెన్ మోగించారు. ప్రభుత్వం అనునయించినా.. మంత్రులు చర్చలు పిలిచినా తగ్గేదేలే అన్నట్టుగా ఏపీ ఉద్యోగులు సమ్మెకు రెడీ అయ్యారు.
సచివాలయంలో జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కు ఉద్యోగ సంఘాల నేతలు సమ్మె నోటీసు అందించారు. 6వ తేదీ అర్థరాత్రి నుంచి విధులు బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.
కాగా.. పీఆర్సీ జీవోలను రద్దు చేస్తేనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీతో చర్చలకు వస్తామని నేతలు తెగేసి చెప్పిన విషయం తెలిసిందే. సమ్మెను ఆపడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
వచ్చే నెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళుతున్నట్లు పేర్కొన్నారు. పీఆర్సీ సాధన సమితి పేరుతో 20 మంది స్టీరింగ్ కమిటీసభ్యులు సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ కు సమ్మె నోటీసు అందజేశారు. సీఎస్ సమీర్ శర్మ ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో జీఏడీ ముఖ్య కార్యదర్శికి నోటీసు అందించారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సంఘాల నుంచి పీఆర్సీ స్ట్రగుల్ కమిటీగా ఏర్పడినట్లు సమ్మె నోటీసులో పేర్కొన్నారు. పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకునే వరకూ సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ పీఆర్సీకి సంబంధించి అధికారుల కమిటీ ఉద్యోగుల అభిప్రాయాలను, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా జీవోలు జారీ చేశారని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. దీనిపై నిరసన కార్యక్రమాలకు ప్రణాళికలు రచించామని.. నిరవధిక సమ్మెకు వెళుతున్నట్టు నోటీసుల్లో పేర్కొన్నారు. సీఎస్ ను సమ్మె నోటీసులు ఉద్యోగ సంఘాల నేతలు జీఏడీ ముఖ్య కార్యదర్శికి అందజేశారు.