Begin typing your search above and press return to search.

కాణిపాకంలో ప్ర‌మాణం స‌రే..ఎందుకింత క్లారిటీ కామినేని

By:  Tupaki Desk   |   10 March 2018 3:40 AM GMT
కాణిపాకంలో ప్ర‌మాణం స‌రే..ఎందుకింత క్లారిటీ కామినేని
X
కేంద్ర ప్ర‌భుత్వం బ‌డ్జెట్లో ఆశ‌లు అడియాస‌లు చేసిన ఎపిసోడ్‌తో ప్రారంభ‌మైన హీట్ తారాస్థాయికి చేరి మిత్ర‌ప‌క్షాల సంవాదం కార‌ణంగా ప‌ద‌వికి గుడ్ బై చెప్పిన బీజేపీ నేత‌ - మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ అనూహ్య నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న నిష్క‌ల్మ‌షత్వాన్ని చాటుకునేందుకు ఆయ‌న ఏకంగా ప్ర‌ముఖ దేవాల‌యంలో ప్ర‌మాణం చేశారు. అయితే ఎందుకు ఇంత క్లారిటీ ఇచ్చార‌నే సందేహం నెల‌కొంది. ఇటీవ‌లే ప‌ద‌వికి రాజీనామా చేసిన కామినేని మంత్రి పదవిలో ఉండగా తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని తెలిపారు.

చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ది వినాయక ఆలయానికి వెళ్లిన కామినేని శ్రీనివాస్ ద‌ర్శ‌నం చేసుకున్న అనంత‌రం ప్రమాణం చేశారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ప్రమాణం చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ…మంత్రి పదవిలో ఉండగా ఎలాంటి అవినీతికి, అక్రమాలకు పాల్పడలేదని చెప్పేందుకు కాణిపాకం వచ్చాన‌ని కామినేని శ్రీనివాస్ అన్నారు. ప్రమాణం చేయడంతో నా అత్మస్థైర్యం మరింత పెరిగిందన్నారు. అదిష్టానం నిర్ణయంమేరకే రాజీనామా చేశామ‌ని మంత్రి కామినేని వివ‌రించారు. టీడీపీ ఇంకా ఎన్డీఏలో కొనసాగుతుందని ఆయ‌న తెలిపారు.

మారిన రాజీక‌య ప‌రిణామాల కార‌ణంగా కామినేని శ్రీ‌నివాస్ రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ భేటీ అనంత‌రం చంద్ర‌బాబుతో స‌మావేశం అయి గ‌త ఎన్నిక‌ల్లో తాను టీడీపీ, బీజేపీ మద్దతుతో ఎమ్మెల్యేగా గెలిచానన్నారు. చంద్రబాబు పాలనను ప్రశంసిస్తూనే అటు ప్రధాని నరేంద్ర మోడీని కామినేని ఆకాశానికి ఎత్తేశారు. మోడీ అధికారంలోకి వచ్చాక ఆయన నీతి నిజాయితీతో… 21 రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలోకి తెచ్చారని విదేశాల్లో సైతం మన ఖ్యాతిని చాటారన్నారు. తాను తప్పు చేసినట్టు ఎవరైనా నిరూపిస్తే రాజకీయాల్లోంచి శాశ్వతంగా తప్పుకుంటానన్నారు. తాను టీడీపీలో చేర‌న‌ని ఆయ‌న క్లారిటీ ఇచ్చారు.