Begin typing your search above and press return to search.
ఏపీ ఎక్స్‌ప్రెస్ తెలంగాణను తాకదా?
By: Tupaki Desk | 30 Jun 2015 5:44 AM GMTఉమ్మడి రాష్ట్రంలో ఏపీ ఎక్స్‌ప్రెస్ అన్న వెంటనే ప్రతిరోజూ ఉదయాన్నే నాంపల్లి స్టేషన్‌లో బయలుదేరి పక్క రోజు ఉదయానికి ఢిల్లీ స్టేసన్‌కు వెళ్లే రైలుబండి ఒకటి గర్తుకు వస్తుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో.. ఏపీ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేసి.. తెలంగాణ ఎక్స్‌ప్రెస్ అంటూ పేరు మార్చేయటం తెలిసిందే.
ఇంతకాలం నడిచిన ఏపీ ఎక్స్‌ప్రెస్‌ను మొదట విజయవాడ నుంచి ఆ తర్వాత విశాఖపట్నం నుంచి నడుపుతారన్న వార్తలు వినిపించాయి. ఏది ఏమైనా.. ఛాన్స్ అంటే తెలంగాణవారిదే అన్న మాట కూడా వినిపించింది. పేరుకు ఏపీ ఎక్స్‌ప్రెస్ అనే కానీ.. తిరిగేది మాత్రం తెలంగాణలోనే కదా అన్న నిష్ఠూరాలు వినిపించాయి. తాజాగా ఏపీ ఎక్స్‌ప్రెస్‌ను తెలంగాణను టచ్ కాకుండా ఢిల్లీకి వెళ్లే మార్గాన్ని ఖరారు చేశారని చెబుతున్నారు.
ముందుగా అనుకున్నట్లే విజయవాడలో బయలుదేరే ఈ బండి.. విశాఖపట్నం మీదుగా.. రాయగఢ్ వయా ఢిల్లీకి చేరుకుంటుందని.. పేరుకు తగ్గట్లే ఏపీలో మాత్రమే తప్ప తెలంగాణను టచ్ కాకుండా దేశ రాజధానికి చేరుకుంటుందని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదన సిద్ధమైందని.. రైల్వేశాఖ అధికారికంగా నిర్ణయం తీసేసుకోవటమే మిగిలి ఉందన్న మాట వినిపిస్తోంది. అయితే.. ఈ రైలు బండి ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందన్నది మాత్రం ఇంకా ఫైనలైజ్ కాలేదు.