Begin typing your search above and press return to search.

ఆగిన రైతు పాదం...ఆంక్షలపైన ఆగ్రహం

By:  Tupaki Desk   |   22 Oct 2022 7:50 AM GMT
ఆగిన రైతు పాదం...ఆంక్షలపైన ఆగ్రహం
X
గత నెలా పది రోజులుగా నిరాటకంగా సాగుతున్న అమరావతి రైతుల పాదయాత్ర సడెన్ గా ఆగింది. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో పాదయాత్రీకులు అకస్మాత్తుగా కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలీసుల ఆగడాలు, ఆంక్షల నడుమ యాత్ర చేయకుండా ఆపేయాలని తీర్మానించారు. ఈ మేరకు స్థానికంగా రైతులు బస చేసిన చోటనే జేఏసీ నాయకులు అంతా చేరి ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

అమరావతి రైతుల పాదయాతరకు అడుగడుగునా పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారు అని రైతులు వాపోతున్నారు. నిజానికి నిన్ననే రామచంద్రాపురం అమరావతి రైతుల పాదయాత్ర చేరక ముందే పోలీసులు రైతుల పాదయాత్రను అడ్డుకున్నారు. పాదయాత్రలో కేవలం ఆరు వందల మందికి మాత్రమే హై కోర్టు అనుమతించిందని, వారి ఐడెంటిటీ కార్డులు మాత్రమే చూపించి పాదయాత్రలో పాల్గొనాలని, అలాగే అనుమతించిన నాలుగు వాహనాలకు మాత్రమే పాదయాత్రలో అవకాశం కల్పిస్తామని కూడా స్పష్టం చేశారు.

రైతుల యాత్రకు మద్దతుగా వచ్చే వారిని అడ్డుకుంటామని కేవలం రైతులు మాత్రమే పాదయాత్ర చేయలని చెప్పడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అదే విధంగా పాదయాత్రలో పాల్గొన్న రైతులకు పోలీసులకు మధ్య ఘర్షణ రేగడంతో కొందరు రైతులు కూడా ఈ వివాదంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు లాఠీలతో కంచెలా ఏర్పాటు చేసి అడ్డుకున్నారని రైతులు ఆరోపించారు.

ఇక ఆ మీదట ఎట్టకేలకు రామచంద్రాపురానికి రైతుల పాదయాత్ర వచ్చి చేరింది. కానీ ఈ రోజు సీరియస్ గానే ఆలోచించి రైతులు తమ పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. కోర్టులోనే ఈ విషయం తేల్చుకోవాలనుకుంటున్నారు.

ఇక వారు బస చేసిన ప్రాంతానికి పోలీసులు వచ్చి కేవలం రైతులు మాత్రమే ఉండాలని వారి ఐడెంటిటీ కార్డులు చూపించాలని కోరడంతో రైతులు దీని మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దీని మీద హై కోర్టు విచారణ సందర్భంగా రైతులను మాత్రమే పాదయాత్రలో అనుమతించాలని, మద్దతు ఇచ్చేవారు అంతా రోడ్డుకు ఇరువైపులా ఉంటూ పాదయాత్రను స్వాగతించవచ్చునని హై కోర్టు సూచించినట్లుగా వార్తలు వచ్చాయి.

దాంతో పోలీసులు కేవలం రైతులను మాత్రమే పాదయాత్రకు అనుమతిస్తామని చెబుతుననరు. మరో వైపు చూస్తే దీని మీద కోర్టులో తమ వాదనను వినిపించుకునేందుకు రైతులు రెడీ అవుతున్నారు. అయితే కోర్టుకు నాలుగు రోజులు వరసబెట్టి సెలవు రావడంతో రైతులు ఏం చేసేది లేక తన పాదయాత్రకు టెంపరరీగా విరామం ప్రకటించారు. మొత్తానికి విశాఖ వైపుగా రైతుల పాదయాత్ర దూసుకువస్తున్న క్రమంలో ఉద్రిక్తతలు పెద్ద ఎత్తున చోటు చేసుకుంటున్నాయి.

అదే సమయంలో ఆంక్షలు కూడా పోలీసులు పెడుతున్నారు అని రైతులు ఆగ్రహిస్తున్నారు. మరి హై కోర్టులో అమరావతి రైతులు తమకు న్యాయం కావాలని సాఫీగా తమ పాదయాత్ర చేసుకునేలా ఉండాలని కోరబోతున్నారు. దానికి హై కోర్టు ఏమి చెబుతుంది అన్నదే చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.