Begin typing your search above and press return to search.

బుగ్గ‌న లాబీయింగ్‌.. మ‌రో 10,500 కోట్ల అప్పు!

By:  Tupaki Desk   |   8 Sep 2021 7:26 AM GMT
బుగ్గ‌న లాబీయింగ్‌.. మ‌రో 10,500  కోట్ల అప్పు!
X
ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి.. మ‌రోసారి అప్పు ప్ర‌య‌త్నం చేశారు. ఇప్ప‌టికే కొన్నాళ్లు గా ఆయ‌న అప్పుల కోసం.. ఢిల్లీలోనే మ‌కాం వేసిన విష‌యం తెలిసిందే. అయితే.. కొన్ని విష‌యాల్లో ఓకే చెబుతున్న కేంద్రం.. మ‌రికొన్ని విష‌యాల్లో మాత్రం అడ్డుత‌గులుతోంది. అయినప్ప‌టికీ.. ప‌ట్టువీడ‌ని విక్ర‌మార్కుడి మాదిరిగా.. బుగ్గ‌న ప్ర‌య‌త్నిస్తున్నారు. తాజాగా మ‌రో 10500 కోట్ల రూపాయ‌ల కోసం ఆయ‌న చేసిన లాబీయింగ్ స‌క్సెస్ అయిన‌ట్టు తెలుస్తోంది.

బ‌హిరంగ మార్కెట్ నుంచి రూ.10500 కోట్ల‌ను అప్పుగా తీసుకునేందుకు కేంద్రం ఓకే చెప్పిన‌ట్టు స‌మాచారం. ఈ విష‌యంలో బుగ్గ‌న బాగానే క‌ష్ట‌ప‌డ్డార‌ని స‌మాచారం. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రినిర్మ‌లా సీతారామన్‌ను.. ఉన్న‌త‌స్థాయి అధికారుల‌తో క‌లిసి గ‌త కొన్ని వారాలుగా వ‌రుస‌గా భేటీ అయ్యార‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో కేంద్ర విత్త మంత్రి బుగ్గ‌న అభ్య‌ర్థ‌న‌కు ప‌చ్చ‌జెండా ఊపార‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో కేంద్ర ఆర్థిక శాఖ‌లోని ఎక్స్‌పెండిచ‌ర్ విభాగం.. రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఓ సమాచారం పంపిన‌ట్టు తెలుస్తోంది.

దీనిప్ర‌కారం.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అద‌నంగా రూ.10500 కోట్ల మేర‌కు బ‌హిరంగ‌ మార్కెట్ నుంచి అప్పు చేసుకునేందుకు అనుమతించాల‌ని కోరిన‌ట్టు తెలిసింది. ఇక‌, రాష్ట్ర ప్ర‌భుత్వ ఆర్థిక విష‌యానికి వ‌స్తే.. క‌రోనా నేప‌థ్యంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విష‌యం తెలిసిందే. కేంద్ర ప‌న్నుల వాటా త‌గ్గిపోవ‌డం మ‌రో ప్ర‌ధాన ఇబ్బందిగా మారింది. అయిన‌ప్ప‌ట‌కీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ తాను హామీ ఇచ్చిన సంక్షేమ ప‌థ‌కాల‌ను ఎక్క‌డా నిలుపుద‌ల చేయ‌కుండా .. ఒక్క ల‌ల‌బ్దిదారుడిని కూడా త‌ప్పించకుండా.. వాటిని అమ‌లు చేస్తున్నారు. కొన్ని సార్లు.. ఉద్యోగుల‌కు జీతాలు ఇవ్వ‌డంలోనూ ఇబ్బందులు ఎదురైనా త‌ట్టుకుంటున్నారు.

ఈ క్ర‌మంల‌లో ఆర్బీఐ వ‌ద్ద‌.. ఓవ‌ర్ డ్రాఫ్ట్ సౌక‌ర్యాన్ని కూడా ఇప్ప‌టికే చాలా సార్లు వినియోగించుకున్నారు. ఈ నిధుల‌తోనే.. రోజు వారీ కార్య‌క్ర‌మాలు సాగిస్తున్నారు. మ‌రోవైపు కేంద్రం తీసుకున్న నిర్ణ‌యంతో అద‌న‌పు రుణాలు తీసుకునే అవ‌కాశం కూడాత‌గ్గిపోయింది. ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో తొలి 9 మాసాల‌కు బ‌డ్జెట్ మేనేజ్‌మెంట్ యాక్ట్ ప్ర‌కారం.. తీసుకునే రుణాల విష‌యంలోనూ అధికంగానే అప్పులు తీసుకుంది. గ‌త వార‌మే 1000 కోట్ల వ‌ర‌కు రుణం తీసుకుంది. దీంతో బ‌హిరంగ మార్కెట్ నుంచి తీసుకునే అప్పుల విష‌యంలో అన్ని దారులు మూసుకుపోయాయి.

ఇక‌, తాజాగా నిర్ణ‌యంతో రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.10500 కోట్లు తెచ్చుకునే సౌక‌ర్యం ఏర్ప‌డింది. ఈ విష‌యంలో త‌మ‌కు స‌హ‌క‌రించిన కేంద్ర ప్ర‌భుత్వానికి బుగ్గ‌న స‌హా రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆదిత్య‌నాథ్ దాస్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ అప్పుతో ఇక‌, డిసెంబ‌రు వ‌ర‌కు ప్ర‌భుత్వానికి బ‌హిరంగ మార్కెట్ నుంచి రుణాలు ద‌క్కే అవ‌కాశం లేదు. ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు ఈ తొమ్మిది నెల‌ల కాలానికి.. మొత్తం రూ.31,251 కోట్లు రాష్ట్రం అప్పుగా తీసుకున్న‌ట్టు అయింది. ఇక‌, ఇప్పుడు తీసుకున్న అప్పు ప్ర‌భుత్వానికి కొంత మేర‌కు ఊపిరి పీల్చుకునే అవ‌కాశం ఇస్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.