Begin typing your search above and press return to search.

కొత్త జిల్లాలతో ఏపీ స్వరూపం ఎలా మారిపోతుందంటే?

By:  Tupaki Desk   |   3 April 2022 5:42 AM GMT
కొత్త జిల్లాలతో ఏపీ స్వరూపం ఎలా మారిపోతుందంటే?
X
అధికారం చేతిలో లేని వేళలో హామీలు ఇవ్వటం బాగానే ఉన్నా.. పవర్లోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయటం అంత తేలికైన విషయం కాదు. ఈ కష్టమైన అంశాన్ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేస్తానని.. అందుకు ప్రతి లోక్ సభ నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా తీసుకుంటానని చెప్పిన ఆయన.. తాను చెప్పినట్లే ఆ పనిని తాజాగా పూర్తి చేశారు. ఉగాది వేళ.. వర్చువల్ గా భేటీ అయిన కేబినెట్.. కొత్త జిల్లాల నోటిఫికేషన్ కు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో గెజిట్ విడుదల కానుంది.

ఏప్రిల్ నాలుగు (సోమవారం) నుంచి కొత్త జిల్లాల ఏర్పాటు అధికారం కానుంది. సోమవారం ఉదయం 9.05 గంటల నుంచి 9.45 గంటల మధ్యలో కొత్త జిల్లాల అవతరణ కార్యక్రమం జరగనుంది. మొత్తం 26 జిల్లాలు.. 73 రెవెన్యూ డివిజన్లతో ఏర్పాటు కానున్నాయి. అదే సమయంలో జిల్లాల వారీగా మండలాల కసరత్తు సైతం పూర్తి అయ్యింది. కొత్త జిల్లాల ప్రకారం రెవెన్యూ డివిజన్లను జిల్లాల వారీగా చూస్తే..

శ్రీకాకుళం జిల్లాలో (3)
పలాస, టెక్కలి, శ్రీకాకుళం.

విజయనగరం జిల్లాలో (3)
బొబ్బిలి, చీపురుపల్లి, విజయనగరం

పార్వతీపురం మన్యం జిల్లాలో (2)
పార్వతీపురం, పాలకొండ

అల్లూరి సీతారామరాజు జిల్లాలో (2)
పాడేరు, రంపచోడవరం

విశాఖపట్నం జిల్లాలో (2)
భీమునిపట్నం, విశాఖపట్నం

అనకాపల్లి జిల్లాలో (2)
అనకాపల్లి, నర్సీపట్నం

కాకినాడ జిల్లాలో
పెద్దాపురం, కాకినాడ (2)

కోనసీమ అమలాపురం జిల్లాలో (3)
రామచంద్రాపురం, కొత్తపేట, అమలాపురం

తూర్పుగోదావరి జిల్లాలో (2)
రాజమహేంద్రవరం, కొవ్వూరు

పశ్చిమ గోదావరి జిల్లాలో (2)
నర్సాపురం, భీమవరం

ఏలూరు జిల్లాలో (3)
జంగారెడ్డిగూడెం, నూజివీడు, ఏలూరు

కృష్ణా జిల్లాలో
గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు (3)

ఎన్టీఆర్ విజయవాడ జిల్లాలో (3)
నందిగామ, తిరువూరు, విజయవాడ

గుంటూరు జిల్లాలో (2)
తెనాలి, గుంటూరు

బాపట్ల జిల్లాలో (2)
చీరాల, బాపట్ల

పల్నాడు జిల్లాలో (3)
నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల

ప్రకాశం జిల్లాలో (3)
కనిగిరి, ఒంగోలు, మార్కాపురం

నెల్లూరు జిల్లాలో (4)
ఆత్మకూరు, కావలి, కందుకూరు, నెల్లూరు

కర్నూలు జిల్లాలో (3)
పత్తికొండ, ఆదోని, కర్నూలు

నంద్యాల జిల్లాలో (2)
డోన్, నంద్యాల, ఆత్మకూరు

అనంతపురం జిల్లాలో (3)
కళ్యాణదుర్గం, గుంతకల్, అనంతపురం

శ్రీసత్యసాయి జిల్లాలో (4)
కదిరి, పుట్టపర్తి, పెనుగొండ, ధర్మవరం

కడప జిల్లాలో (3)
జమ్మలమడుగు, కడప, బద్వేల్

అన్నమయ్య జిల్లాలో (3)
రాయచోటి, మదనపల్లె, రాజంపేట

చిత్తూరు జిల్లాలో (4)
కుప్పం, పలమనేరు, నగరి, చిత్తూరు

తిరుపతి జిల్లాలో (4)
శ్రీకాళహస్తి, తిరుపతి, గూడూరు, సూళ్లూరుపేట

కొత్త జిల్లాలకు సంబంధించిన మండలాల లెక్క తేల్చారు. జిల్లాల వారీగా మండలాల్ని చూస్తే.. ఉత్తరాంధ్ర ప్రాంతంలో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 30 మండలాలు ఉంటే.. తర్వాతి స్థానంలో విజయనగరం జిల్లా 27 మండలాలతో రెండో స్థానంలో నిలిచింది. అతి తక్కువ మండలాలు ఉన్న జిల్లాలుగా విశాఖపట్నం నిలిచింది. కేవలం 11 మండలాలు మాత్రమే ఈ జిల్లాలో ఉన్నాయి. తర్వాతి స్థానంలో పార్వతీపురం మన్యం జిల్లా నిలిచింది. ఈ జిల్లాలో కేవలం 15 మండలాలు మాత్రమే ఉన్నాయి.

- శ్రీకాకుళం జిల్లా.. 30 మండలాలు

- విజయనగరం జిల్లా.. 27 మండలాలు

- పార్వతీపురం మన్యం జిల్లా.. 15 మండలాలు

- అల్లూరి సీతారామరాజు జిల్లా.. 22 మండలాలు

- విశాఖపట్నం జిల్లా.. 11 మండలాలు

- అనకాపల్లి జిల్లా.. 24 మండలాలు

పాత గోదావరి జిల్లాలు.. కొత్తగా ఐదు జిల్లాలుగా మారిన సంగతి తెలిసిందే. అత్యధిక మండలాలు ఉన్న జిల్లాగా ఏలూరు నిలిచింది. ఈ జిల్లాలో 28 మండలాలు ఉన్నాయి. అతి తక్కువ మండలాలు ఉన్న జిల్లాలుగా తూర్పు.. పశ్చిమ గోదావరి జిల్లాలు నిలిచాయి. రెండు జిల్లాల్లోనే 19 మండలాలు ఉన్నాయి. మిగిలిన ప్రాంతాల్లోని పలు జిల్లాలతో పోలిస్తే.. ఈ జిల్లాల్లో మండలాలు ఎక్కువగా ఉండటం గమనార్హం.

- కాకినాడ జిల్లా.. 21 మండలాలు

- కోనసీమ జిల్లా.. 22 మండలాలు

- తూర్పుగోదావరి జిల్లా.. 19 మండలాలు

- పశ్చిమగోదావరి జిల్లా.. 19 మండలాలు

- ఏలూరు జిల్లా.. 28 మండలాలు

కోస్తా ప్రాంతంగా పేర్కొనే క్రిష్ణా జిల్లా మొదలు నెల్లూరు జిల్లా వరకు చూస్తే.. తాజాగా ఈ ప్రాంతం ఏడు జిల్లాలుగా మారింది. ఇందులో అత్యధిక మండలాలు ఉన్న జిల్లాలుగా ప్రకాశం.. నెల్లూరు జిల్లాలు నిలిచాయి. రెండు జిల్లాల్లోనూ 38 మండలాలు ఉన్నాయి. అతి తక్కువ మండలాలు ఉన్న జిల్లాగా గుంటూరు నిలిచింది. ఈ జిల్లాలో 18 మండలాలు ఉన్నాయి.

- కృష్ణా జిల్లా.. 25 మండలాలు

- ఎన్టీఆర్ జిల్లా.. 20 మండలాలు

- గుంటూరు జిల్లా.. 18 మండలాలు

- బాపట్ల జిల్లా.. 25 మండలాలు

- పల్నాడు జిల్లా.. 28 మండలాలు

- ప్రకాశం జిల్లా.. 38 మండలాలు

- నెల్లూరు జిల్లా.. 38 మండలాలు

రాయలసీమ ప్రాంతానికి సంబంధించి పాత లెక్కల్లో నాలుగు జిల్లాలు ఉంటే.. కొత్తగా మాత్రం 8 జిల్లాలుగా అవతరించింది. ఈ జిల్లాల్లో అత్యధిక మండలాలు ఉన్న జిల్లాగా కడప జిల్లా నిలిచింది. ఈ జిల్లాలో 36 మండలాలు ఉన్నాయి. తర్వాతి స్థానంలో శ్రీ సత్యసాయి జిల్లా 32 మండలాలతో రెండో స్థానంలో నిలిచింది. అతి తక్కువ మండలాలు ఉన్న జిల్లాగా కర్నూలు జిల్లా నిలిచింది. ఈ జిల్లాలో 26 మండలాలు ఉన్నాయి.

- కర్నూలు జిల్లా.. 26 మండలాలు

- నంద్యాల జిల్లా.. 29 మండలాలు

- అనంతపురం జిల్లా.. 31 మండలాలు

- శ్రీ సత్యసాయి జిల్లా.. 32 మండలాలు

- వైఎస్సార్ కడప జిల్లా.. 36 మండలాలు

- అన్నమ్మయ్య జిల్లా.. 30 మండలాలు

- చిత్తూరు జిల్లా.. 31 మండలాలు

- తిరుపతి జిల్లా.. 34 మండలాలు