Begin typing your search above and press return to search.
బీజేపీ గూటికి ఐవైఆర్..ఇక బాబుకు సినిమానే!
By: Tupaki Desk | 16 Sep 2018 8:50 AM GMTతెలుగుదేశం పార్టీ శ్రేణులు అవాక్కయ్యే పరిణామం చోటు చేసుకంది. కొద్ది కాలంగా తన ట్వీట్లతో - కార్యక్రమాలతో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు బీజేపీలో చేరారు. నిన్న హైదరాబాద్ లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను సమక్షంలో కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కృష్ణారావుకు పార్టీ కండువా కప్పి షా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఉన్నారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన ఐవైఎర్ పనితీరును అప్పట్లో నచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు తన సర్కారులో ప్రధాన కార్యదర్శిగా నియమించుకున్నారు. పదవీ విరమణ చేసిన అనంతరం బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి - కేబినెట్ హోదాతో సమానమైన చైర్మన్ పదవిని ఐవైఆర్ కృష్ణారావుకు కట్టబెట్టారు. అయితే తాజాగా ఐవైఆర్ చేస్తున్న పనులు బాబును ఇరకాటంలో పడేశాయి. సీఎం చంద్రబాబు - ఆయన కుమారుడు లోకేష్ లపై సోషల్ మీడియాలో వస్తున్న వ్యతిరేక వార్తలను కృష్ణారావు షేర్ చేయడం ప్రభుత్వ - పార్టీ వర్గాల్లో అంతర్గత చర్చకు దారితీసింది.సోషల్ మీడియాలో విమర్శలను సరదాగా తీసుకోవాలి తప్ప కేసులు పెట్టడం నియంతృత్వమని ఫేస్ బుక్ లో కృష్ణారావు కామెంట్ చేశారు. మరోవైపు సినీ పరిశ్రమను సైతం ఐవైఆర్ ప్రస్తావించారు. నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు వినోద పన్ను మినహాయింపు - బాహుబలి-2 అదనపు షోలకు అనుమతులు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. టీటీడీ ఈవోగా తెలుగేతర అధికారిని నియమించడం మంచి పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. ఇలా ప్రభుత్వాన్ని - సీఎం చంద్రబాబును నేరుగా విమర్శిస్తూ పెట్టే ఫోటోలు - పోస్టులను సైతం ఫేస్ బుక్ వాల్ పై షేర్ చేశారు. దీంతో టీడీపీ పెద్దలు భగ్గుమన్నారు. దీంతో ఆయన పదవి ఊడింది.
కాగా, బ్రాహ్మణ పరిషత్ పదవిని వదిలిపెట్టిన అనంతరం ఐవైఆర్ మరింత దూకుడు పెంచారు. అభివృద్ధి మంత్రం - ప్రాంతీయ వైరుధ్యాల ఎజెండాను తెరమీదకు తీసుకువచ్చారు. జన చైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణ రెడ్డి అధ్యక్షతన ‘రాయలసీమ అభివృద్ధి- సవాళ్లు’ అంశంపై సెమినార్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడుతూ శ్రీబాగ్ ఒప్పందం - శివరామక్రిష్ణన్ నివేదికల స్ఫూర్తికి భిన్నంగా అభివృద్ధిని కేంద్రీకరిస్తున్నారని విమర్శించారు. రాయలసీమలో తప్పకుండా హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్ - చత్తీస్ ఘడ్ - కేరళ - మధ్యప్రదేశ్ - ఒరిస్సా - రాజస్థాన్ - ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రాజధానులు - హైకోర్టులు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయని తెలిపారు. కావున రాయలసీమలో తప్పకుండా హైకోర్టు ఏర్పాటు చేయాలని ఐవైఆర్ కృష్ణారావు డిమాండ్ చేశారు. ఇలా బాబును ఉక్కిరి బిక్కిరి చేసిన ఐవైఆర్ బీజేపీ గూటికి చేరారు. `ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు #కన్నాలక్ష్మీనారాయణ గారి చొరవ మేరకు #బీజేపీ అధ్యక్షులు #అమిత్ షా గారి ఆహ్వానానికి స్పందించి అమిత్ షా గారి సమక్షంలో నిన్న భారతీయ జనతా పార్టీ లో చేరాను. అభినందించిన వారందరికీ నా కృతజ్ఞతలు.`అంటూ ట్వీట్ చేశారు.