Begin typing your search above and press return to search.
దేశంలో మరే రాష్ట్రానికి లేని క్రెడిట్ ఏపీకే ఉంది!
By: Tupaki Desk | 17 July 2019 6:25 AM GMTచెత్త విషయాల్లో తెలుగు రాష్ట్రాల పేరు తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఇలాంటివి విన్నప్పుడల్లా తెలుగోళ్లుగా మనమింతగా వెనుకబడి ఉన్నామా? అన్న ఆవేదన వ్యక్తమవుతుంది. అయితే.. దీనికి భిన్నంగా ఏపీ ప్రజలకు ఊరట కలిగే లెక్క ఒకటి తాజాగా బయటకు వచ్చింది. దేశంలో మరే రాష్ట్రానికి ఇలాంటి ప్రత్యేకత లేదని.. ఏపీకే సొంతమని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇంతకీ ఆ ప్రత్యేకత ఏమంటే.. దేశంలో అత్యధిక సంఖ్యలో కలిసి ఉన్న దంపతుల్లో ఏపీనే ముందుంది. ఈ జాబితాలో తెలంగాణ ఐదో స్థానంలో నిలిచింది. ఆసక్తికరమైన మరో విషయం ఏమంటే.. అత్యధిక దంపతులున్న రికార్డును సొంతం చేసుకున్న ఏపీలోనే.. జీవిత భాగస్వామిని కోల్పోయిన వారు.. దూరమైన వారు కూడా ఎక్కవేనన్న విషయం బయటకు వచ్చింది. దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే 2017 గణాంకాల విశ్లేషణ సందర్భంగా ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి.
ఈ సర్వే ప్రకారం దేశ జనాభాలో 46.8 శాతం మంది వివాహితులు ఉండగా.. అన్ని రాష్ట్రాల కంటే మెరుగ్గా ఏపీలోనే ఎక్కువమంది దంపతులు (54%) కలిసి ఉండగా.. తర్వాతి స్థానం కేరళ(51.5%).. తమిళనాడు (51.2%).. పశ్చిమ బెంగాల్ (51.1%0 నిలవగా తెలంగాణ రాష్ట్రం ఐదో స్థానంలో నిలిచింది. దేశంలో అతి తక్కువగా బిహార్ లో వివాహితులు ఉన్నట్లు తేలింది.
ఎక్కువమంది వివాహితులు ఉన్న ఏపీలోనే జీవిత భాగస్వామిని కోల్పోయిన వారు.. వారి నుంచి దూరంగా ఉన్న వారు కూడా ఏపీలోనే ఎక్కువని తేలింది. ఇలాంటి వారు దేశ జనాభాలో 3.7 శాతం ఉంటే.. ఏపీలో మాత్రం అది కాస్తా 5.1 శాతంగా ఉంది. జాతీయ సగటుతో పోలిస్తే ఏపీ పురుషుల్లో 2.4 శాతం మంది జీవిత భాగస్వామిని కోల్పోవటం లేదంటే దూరంగా ఉండగా.. మహిళల్లో ఇది రికార్డు స్థాయిలో 7.9 శాతం ఉండటం గమనార్హం. ఇదే అంశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి వస్తే పురుషుల్లో 2 శాతం మంది.. మహిళల్లో 7.6 శాతం మంది ఇలాంటివారేనని తేలింది.