Begin typing your search above and press return to search.
0891-2890525.. ఏపీ చిరువ్యాపారులు ఈ నెంబరుకు ఫోన్ చేస్తే?
By: Tupaki Desk | 22 Oct 2021 1:30 AM GMTరాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ వాటి గురించి పట్టించుకోకుండా.. తన క్యాలెండర్లో అమలు చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాల్ని ఎప్పటికప్పుడు అమలు చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంచలనంగా మారుతున్నారు. ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నప్పటికీ.. వాటిని తట్టుకొని నిలవటం అంత తేలికైన విషయం కాదంటున్నారు. జగన్ సర్కారు అమలు చేసే పలు సంక్షేమ పథకాల్లో ఒకటి చిరువ్యాపారులకు అండగా నిలిచే ‘జగనన్న తోడు’.
ఇందులో భాగంగా వడ్డీ బెడద లేకుండా వ్యాపారులకు రూ.10వేలు చొప్పున అప్పు ఇవ్వటం తెలిసిందే. చిరు వ్యాపారులు వెయ్యి అప్పు తీసుకుంటే.. సాయంత్రానికి రూ.వంద కట్టించుకునే వడ్డీ వ్యాపారులకు చెక్ పెట్టేందుకు వీలుగా గత ఏడాది జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించటం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా రూ.10వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని వడ్డీ లేకుండా ఇస్తారు. సకాలంలో చెల్లిస్తే.. వడ్డీని మినహాయింపు ఇస్తారు. మళ్లీ అప్పు ఇస్తారు.
ఇప్పటివరకు రాష్ట్రంలో 9.05లక్షల మందికి రూ.905 కోట్ల వడ్డీ లేని రుణాల్ని ఇచ్చినట్లుగా ఏపీ ప్రభుత్వం చెబుతోంది. గత ఏడాది తీసుకున్న అప్పులు ఇప్పటికి కట్టకుంటే.. ఇప్పుడైనా కట్టాలని.. మళ్లీ డిసెంబరులోనూ.. జూన్ లోనూ రుణాలు పొందటానికి వీలు ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు.. ఈ పథకానికి సంబంధించిన ఏమైనా ఇబ్బందులు.. సందేహాలు ఉంటే తీర్చటానికి వీలుగా కొత్తగా ఫోన్ నెంబరును ఏర్పాటు చేశారు. 0891-2890525 ఈ నెంబరుకు ఫోన్ చేస్తే.. సందేహాల్ని తీరుస్తారని.. సూచనలు చేస్తారని చెబుతున్నారు.