Begin typing your search above and press return to search.
ఏకాభిప్రాయం కుదురుతున్నట్లేనా ?
By: Tupaki Desk | 5 Feb 2022 4:33 AM GMTమంత్రుల కమిటీ - ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతల మధ్య ఏకాభిప్రాయం కుదురుతున్నట్లేనా ? శుక్రవారం వీళ్ళద్దరి మధ్య జరిగిన చర్యల వాతావరణం చూస్తే అలాగే అనిపిస్తోంది. 6వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు ఉద్యోగులు రెడీ అయిపోతున్నారు. ఉద్యోగులను సమ్మెలోకి వెళ్ళకుండా మంత్రుల కమిటీ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే శుక్రవారం రాత్రి 7 గంటల నుంచి అర్ధరాత్రి దాటిన తర్వాత 1 గంటవరకు చర్చలు జరిగాయి. మళ్ళీ శనివారం మధ్యాహ్నం కూడా చర్చలకు కూర్చోబోతున్నారు.
శుక్రవారం అర్ధరాత్రి చర్యల తర్వాత ఇటు మంత్రుల కమిటీ, అటు ఉద్యోగుల నేతలు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగుల నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ కొన్ని అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందని చెప్పారు. మరిన్ని అంశాలపై చర్చలు జరగాల్సుందని నేతలు చెప్పారు. వాటిపైన కూడా ఏకాభిప్రాయం కుదిరితే సమ్మె విరమణ విషయంపై ప్రకటిస్తామన్నారు. మంత్రుల కమిటీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
ఏకాభిప్రాయం కుదిరిన అంశాలేమిటంటే పీఆర్సీని ఐదేళ్లకొకసారి నియమించేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఐఆర్ రికవరీ ఉండదని కూడా మంత్రుల కమిటీ హామీ ఇచ్చింది. పీఆర్సీ స్ధానంలో పదేళ్ళకొకసారి కేంద్రం విధానాన్ని అమలు చేయాలని గతంలో ప్రభుత్వం డిసైడ్ చేసింది. అలాగే హెచ్ఆర్ఏ శ్లాబులను సవరించేందుకు ప్రభుత్వం రెడీగా ఉంది. క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను ఇపుడు 70 ఏళ్ళ తర్వాత వర్తిస్తోంది. దీన్ని 80 ఏళ్ళకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను 80 నుండి 70 ఏళ్ళకు తగ్గించేందుకు ప్రభుత్వం రెడీగా ఉందని మంత్రుల కమిటి హామీ ఇచ్చింది.
వివాదం పరిష్కారానికి ప్రభుత్వం కొన్ని మెట్లు దిగింది కాబట్టి ఉద్యోగుల నేతలు కూడా కొన్ని మెట్లు దిగితే వివాదం పరిష్కారమైనట్లే. మధ్యాహ్నం మొదలయ్యే మంత్రుల కమిటీ-నేతల చర్చలకు అంతిమంగా జగన్మోహన్ రెడ్డి సమక్షంలో శుభం కార్డు పడుతుందనే అనుకుంటున్నారు. సమ్మె చేసే ఉద్యోగులపై యాక్షన్ తీసుకునే స్వేచ్చను హైకోర్టు ప్రభుత్వానికే వదిలేసింది. అసలు ఛలో విజయవాడ కార్యక్రమాన్ని ఎలా జరగనిచ్చారంటు ప్రభుత్వాన్ని కోర్టు నిలదీసింది. కాబట్టి హైకోర్టు వ్యాఖ్యలు కూడా ఉద్యోగ నేతలపై ప్రభావాన్ని చూపిందనే అనుకోవాలి. ఏదేమైనా చర్చలు ఫలప్రదమై సమ్మెను విరమిస్తే అంతకంటే కావాల్సిందేముంది ?