Begin typing your search above and press return to search.

అయోమయంలో సర్కారు... ఆందోళనలో ఉద్యోగులు?

By:  Tupaki Desk   |   28 July 2022 11:30 PM GMT
అయోమయంలో సర్కారు... ఆందోళనలో ఉద్యోగులు?
X
కాంట్రిబ్యూట‌రీ పెన్ష‌న్ స్కీం (సీపీఎస్) ర‌ద్దు విష‌య‌మై ఇప్ప‌టికే ప‌లు మార్లు ప‌లు వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు తాజాగా ఉద్యోగులు దాచుకున్న మొత్తాల‌ను ష్యూరిటీగా ఇస్తూ ప్ర‌భుత్వం లోన్లు పొందేందుకు ప్ర‌య‌త్నిస్తోంది అన్న వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో గ‌డిచిన రెండు రోజులుగా ఈ వివాదం రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ న‌డుస్తోంది.

అస‌లు ఏపీ ప్ర‌భుత్వం త‌ర‌ఫున అప్పుల వివ‌రం అందించిందే కేంద్రం క‌నుక ఇప్పుడేం చేయాలో ఎవ‌రిని నిందించాలో తెలియ‌క, గుట్టు కాస్త ర‌ట్ట‌యింద‌ని వైసీపీ నాయ‌కులు త‌లలు ప‌ట్టుకుంటున్నారు.

ఈ సమయంలో మరో విషయం వెలుగు చూసింది. వాస్త‌వానికి ఎంప్లాయీస్ అంతా క‌లిసి దాచుకునే మొత్తం మూడు వేల కోట్ల రూపాయ‌లకు కూడా దాట‌ద‌ని తేలింది. ఉద్యోగుల వాటా కింద జీతాల నుంచి ప‌దిశాతం సీపీఎస్ కింద జ‌మ చేస్తారు.

ఆ లెక్క‌న ఉద్యోగులు దాచుకున్న మొత్తం రెండు వేల అర‌వై కోట్లు అని తేలింది. స‌చివాల‌య ఉద్యోగుల జ‌మ మ‌రో వెయ్యి కోట్లు అని అనుకున్నా మొత్తం దీని విలువ మూడు వేల కోట్లకు పైగానే అని నిర్థార‌ణ అవుతోంది.

కానీ కేంద్రం నుంచి మాత్రం నాలుగు వేల కోట్ల రూపాయ‌లకు పైగా అప్పులు ఏపీ స‌ర్కారు తె చ్చింద‌ని పార్ల‌మెంట్ నివేదికల ఆధారంగా అందుతున్న స‌మాచారం. అంటే తాము దాచుకున్న డ‌బ్బు క‌న్నా ఎక్కువ ప్ర‌భుత్వం అప్పు రూపేణా తెచ్చుకోగ‌లుగుతుందా అన్న సందేహ‌మే ఏపీ ఎంప్లాయీస్ ను వెన్నాడుతోంది.

ఇదెలా సాధ్యం అని ప్ర‌శ్నిస్తోంది. అంటే అప్పుల గుట్టు అయితే మోడీకి లేదా జ‌గ‌న్ కే తెలియాలి అని మేం అనుకోవాలి అని వ్యాఖ్య‌లు చేస్తున్నారు.