Begin typing your search above and press return to search.

రాష్ట్రంలో లాక్ డౌన్ పై ఏపీ సర్కార్ ప్రకటన

By:  Tupaki Desk   |   27 March 2021 4:21 PM GMT
రాష్ట్రంలో లాక్ డౌన్ పై ఏపీ సర్కార్ ప్రకటన
X
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన రెండు రోజుల్లోనే ఏపీ ప్రభుత్వం నుంచి కూడా ప్రకటన చేశారు. కరోనా కల్లోలం వేళ రాష్ట్రంలో లాక్ డౌన్ పై ఏపీ సర్కార్ స్పష్టతనిచ్చింది.ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ లాక్ డౌన్ పై హోంమంత్రి సుచరిత స్పందించారు. ప్రస్తుతం లాక్ డౌన్ అవసరం లేదని భావిస్తున్నామని తెలిపారు.

కరోనా మొదట్లో సరైన చికిత్స విధానం తెలియక లాక్ డౌన్ పెట్టాల్సి వచ్చిందని.. ఇప్పుడు టీకా రావడంతో లాక్ డౌన్ అవసరం లేదని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.వ్యాక్సిన్లపై ఎలాంటి పుకార్లు నమ్మవద్దని, అందరూ టీకా తీసుకోవాలని పిలుపునిచ్చారు. టీకా తీసుకున్న తర్వాత 45 రోజులు జాగ్రత్తగా ఉండాలన్నారు.