Begin typing your search above and press return to search.
ఏబీ వెంకటేశ్వరరావుపై సుప్రీంకు జగన్ ప్రభుత్వం
By: Tupaki Desk | 2 July 2020 2:30 PM GMTగత చంద్రబాబు ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉండి నాటి ప్రతిపక్ష వైసీపీని ఇబ్బందులకు గురిచేశాడని ఆరోపణలు ఎదుర్కొన్న సీనియర్ ఐపిఎస్ అధికారి, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎబి వెంకటేశ్వర్ రావుపై ఓ కేసులో విచారణ జరిపి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సస్పెన్షన్ పై ఆయన హైకోర్టుకు ఎక్కారు.. ప్రభుత్వం సస్పెన్షన్ ను రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. అయితే హైకోర్టు ఉత్తర్వులు సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టులో ప్రత్యేక సెలవు పిటిషన్ ను వేసింది.
హైకోర్టు ఉత్తర్వులను నిలిపివేసి, వెంకటేశ్వర్ రావు సస్పెన్షన్ కొనసాగించాలని జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును అభ్యర్థించింది. పిటిషన్ జూలై 6 తర్వాత విచారణకు వచ్చే అవకాశం ఉంది.
ఇక వెంకటేశ్వరరావు ఇప్పటికే సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. తన ఉద్యోగం పునరుద్దరించాలని.. పూర్వపు స్థితిలో తనకు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చేలా చూడాలని కోర్టును అభ్యర్థించారు.
మే 22న రాష్ట్ర హైకోర్టు వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను పక్కన పెట్టి, ఆయనను తిరిగి సాధారణ విధుల్లోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సీనియర్ ఐపిఎస్ అధికారికి సస్పెన్షన్ కాలానికి జీతం చెల్లించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
చంద్రబాబు హయాంలో ఇజ్రాయెల్ సంస్థ ఆర్.టి. ఇన్‌ఫ్లాటబుల్ ఆబ్జెక్ట్స్ నుంచి నిఘా సామగ్రిని కొనుగోలు చేసే విషయంలో అప్పటి నిఘా విభాగం చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు నిబంధనలు పాటించలేదని.. తన కొడుకు యాజమాన్యంలోని కంపెనీకి కాంట్రాక్టును ఇచ్చి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో జగన్ ప్రభుత్వం విచారణ జరిపి ఫిబ్రవరి 8న వెంకటేశ్వర్ రావును సస్పెండ్ చేసింది.
అయితే ఏబీ వెంకటేశ్వర రావు రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ ను సవాలు చేస్తూ క్యాట్ తలుపులు తట్టాడు. కానీ క్యాట్ ఈయన పిటిషన్ ను కొట్టివేసింది. కేసులను నమోదు చేసి దర్యాప్తు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. తరువాత క్యాట్ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏబీ వెంకటేశ్వర్లు హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఊరట లభించినా వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళుతుండడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది.