Begin typing your search above and press return to search.
ఉత్తరాంధ్రకు జగన్ మరో వరం!
By: Tupaki Desk | 25 Aug 2020 4:00 PM GMTఅధికార వైసీపీ ప్రభుత్వం ఉత్తరాంధ్రకు మరో వరం ప్రకటించింది. ఇప్పటికే విశాఖను పరిపాలన రాజధానిగా చేసిన సీఎం జగన్ రాజధాని ప్రాంతమైన భీమిలి నుంచి విజయనగరం జిల్లాలోని భోగాపురం మధ్య ఆరు లైన్ల రహదారి నిర్మాణానికి టెండర్లను పిలిచింది. ఇప్పుడు తాజాగా మరో కీలక ప్రాజెక్టును ప్రకటించింది.
శ్రీకాకుళం జిల్లాలో భావనపాడు నాన్ మేజర్ పోర్టు ను నిర్మించడానికి జగన్ సర్కార్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. భావనపాడు ఓడరేవు నిర్మాణానికి డీపీఆర్ కు ఆమోదం తెలిపింది. ఈ డీపీఆర్ ప్రకారం పోర్టు నిర్మాణానికి అవసరమైన ప్రారంభ పనులను చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా డీపీఆర్ పై వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.
ఓడరేవు నిర్మాణాన్ని మూడు దశల్లో పూర్తి చేసే అవకాశాలున్నాయి. తొలి దశ కింద 3669.95 కోట్ల రూపాయలు వ్యయం అవుతాయని ప్రభుత్వం అంచనావేసింది. 36నెలల్లో దీన్ని పూర్తి చేయాల్సి ఉంటుందని భావిస్తోంది. ఇందులో 2123 కోట్ల రూపాయలను రుణ రూపంలో సేకరించాలని నిర్ణయించింది.
శ్రీకాకుళం జిల్లా భావనపాడును నిర్మించడంతోపాటు విశాఖ జిల్లాలో గంగవరం పోర్ట్ ను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.