Begin typing your search above and press return to search.
రొనాల్డో ఫోటోను భలేగా వాడేసిన ఏపీ సర్కార్
By: Tupaki Desk | 23 Jun 2021 5:30 AM GMTసోషల్ మీడియా కాలంలో క్రియేటివిటీకి మించిన ఆయుధం ఇంకేం ఉంటుంది. చుట్టు ఉండే వాటితో అందరిని కనెక్టు చేసేలా చేయటం కూడా ఒక అర్టే. తాజాగా అలాంటి అద్భుతమైన వాడకాన్ని ప్రదర్శించింది ఏపీ సర్కార్. కరోనా వేళ.. భౌతిక దూరం.. ముఖానికి మాస్కు కట్టుకోవటం.. ఎప్పటికప్పుడు శానిటైజర్ వాడటం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయితే.. ఇదే విషయాల్ని ఎవరైనా ప్రముఖుడి చేత చెప్పిస్తే.. ప్రజల మీద చూపించే ప్రభావం వేరుగా ఉంటుంది.
ఈ విషయాన్ని గుర్తించిన ఏపీ ప్రభుత్వం తన ఆరోగ్య ఆంధ్ర ట్విటర్ అకౌంట్లో ప్రదర్శించిన క్రియేటివిటీని చూసి ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ప్రఖ్యాత ఫుట్ బాల్ ప్లేయర్ రొనాల్డోను వాడేసిన తీరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కరోనా బారిన పడకుండా ఉండటం కోసం ఏమేం చేయాలన్న విషయాన్ని ప్రజలకు ఇట్టే అర్థమయ్యేలా ఒక పోస్టును పెట్టింది ఏపీ సర్కారు.
ఇందుకోసం రొనాల్డోను తెలివిగా వాడేసింది. ఈ మధ్యన కోక్ ఎపిసోడ్ తో ఆ స్టార్ క్రీడాకారుడి రేంజ్ ఏమిటో ఇట్టే అర్థం కావటం తెలిసిందే. మీడియా సమావేశంలో తన ఎదురుగా ఉన్న కోక్ బాటిల్స్ ను పక్కన పెట్టేస్తూ.. కోకకోలా డ్రింక్ తాగొద్దన్న అతడి మాటలతో ఆ కంపెనీ ఏకంగా రూ.29వేల కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది.
ఆ సందర్భంలో ముఖానికి మాస్కు కట్టుకున్న రొనాల్డో ఫోటోను ఏపీ సర్కారు తనకు తగ్గట్లుగా ప్రచారానికి వాడుకుంది. మీ ముక్కులు.. మూతి.. గడ్డం కవర్ అయ్యేలా మాస్క్ ధరించండంటూ రొనాల్డో ఫోటోతో క్యాప్షన్ ఇచ్చిన వైనం అందరిని ఆకర్షించటమే కాదు.. తెలివైన ప్రచారం అంటూ ప్రశంసల్ని కురిపిస్తున్నారు.