Begin typing your search above and press return to search.
ఉద్యమమే అంటున్న ఉద్యోగి : సీపీఎస్ కి ఎస్ అనాల్సిందే...?
By: Tupaki Desk | 18 Aug 2022 4:30 PM GMTజగన్ మాట తప్పను మడమ తిప్పను అని చెబుతారు. ఆ బ్రాండ్ ని ఆయన పదికాలాల పాటు కాపాడుకోవాలంటే మాత్రం చేయాల్సినది ఒకటి ఉంది. అదే సీపీఎస్ రద్దు. కంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం ని రద్దు చేస్తాను అని పాదయాత్ర వేళ జగన్ హామీ ఇచ్చారు. ఇది ఎంత కష్టతరమో ఆయనకు నాడు తెలిసినట్లు లేదు. అందుకే అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తరువాత తాపీగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి తాం స్టడీ చేయకుండా హామీ ఇచ్చేశామని చెప్పారు.
కానీ ఎలా ఇచ్చినా హామీ హామీయే. అది నెరవేర్చి తీరాల్సిందే. ఈ ఒక్క హామీ వల్లనే మొత్తానికి మొత్తం ఉద్యోగులు టర్న్ అయి వైసీపీని గెలిపించారు.
అంటే ముఖ్యమంత్రి కుర్చీ జగన్ కి దక్కడంలో సీపీఎస్ రద్దు అన్న హామీ చాలా కీలకమైన పాత్ర పోషించింది అని చెప్పాలి. తీరా పవర్ లోకి వచ్చాక చేయను అని మొరాయిస్తే అది మాట తప్పడం కంటే కూడా దారుణం. అందుకే ఉద్యోగులు ఇపుడు అంతే పట్టుదల మీద ఉన్నారు.
సీపీఎస్ కి ఆల్టర్నేషన్ గా జీపీఎస్ అని మరో దాన్ని తీసుకువస్తున్నామని ప్రభుత్వం అంటోంది. అయితే అది సీపీఎస్ కంటే అత్యంత ప్రమాదం అని ఉద్యోగులు అంటున్నారు. తమకు ఇవన్నీ వద్దు సీపీఎస్ రద్దు మాత్రమే కావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అందువల్ల ప్రభుత్వానికి ఇది కాకుండా వేరు మార్గం లేదు. కాదంటే టోటల్ గా అరు లక్షల మంది ఉద్యోగులు రివర్స్ అవుతారు. వారి ఫ్యామిలీస్ ఓట్లు కూడా కలుపుకుంటే వైసీపీకి రెండవమారు అధికారం కల్ల అన్న మాటే అంటున్నారు.
ఇదిలా ఉంటే సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరిస్తే పెన్షన్ కోసమే ప్రభుత్వం ఖజానాను దోచిపెట్టాల్సి ఉంటుందని కూడా అర్ధం చేసుకోవాలి. ఈ రోజున రాజస్థాన్, జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వాల ఆర్ధిక పరిస్థితి బాగుందని సీపీఎస్ ని రద్దు చేసినా మరో సీఎం ఏలుబడిలో అయినా సీపీఎస్ ని తీసుకువస్తారు. ఎందుకంటే ఇది ఆర్ధికంగా అతి పెద్ద భారం.
పైగా గతంతో పోలిస్తే మానవ జీవిత కాలం పెరిగింది. అందువల్ల పెన్షన్లను జీతాల మాదిరిగా ఇస్తూ పోవడాన్ని ఎవరైనా తట్టుకోవడం కష్టమే. సరే ఆ సంగతి ఎలా ఉన్నా జగన్ మాత్రం సీపీఎస్ రద్దు చేసి తీరాల్సిందే. మురిపించుకుంటే మాత్రం నష్టం కష్టం ఆయనకే అని చెప్పకతప్పదు అంటున్నారు. ఉద్యోగులు మాత్రం సెప్టెంబర్ 1న చలో విజయవాడకు పిలుపు ఇచ్చేశారు. ఇక బంతి వైసీపీ కోర్టులోనే ఉంది అన్న మాట.