Begin typing your search above and press return to search.
అప్పు మీద అప్పు.. ఏపీ సర్కారు అడుగులు ఇవే!
By: Tupaki Desk | 27 Aug 2022 6:59 AM GMTరాష్ట్రం వరకు ఎందుకు.. ఎవరికి వారి వ్యక్తిగత జీవితాన్నే తీసుకుంటే.. వచ్చే ఆదాయం తక్కువగా ఉండి.. ఖర్చులు ఎక్కువగా ఉంటే ఏం చేస్తాం? తొలుత ఖర్చులను తగ్గించుకునే పనిలో పడడం.. ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేయటం.. అప్పటికి సాధ్యం కాకపోతే అప్పులు చేయటం లాంటివి చేస్తాం.
వ్యక్తుల విషయాల్లో ఇలాంటివి ఓకే. కానీ.. ప్రభుత్వాల విషయంలో ఇలాంటివి ఉండవు కదా? భవిష్యత్తు సంగతి తర్వాత వర్తమానం గడిస్తే చాలు.. ఓట్ల రేసులో ముందుకు వెళ్లాలన్న ఆకాంక్ష తప్పించి.. గాడితప్పిన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే ఆలోచన కంటే కూడా.. సంక్షేమ రంగంలో తిరుగులేని ఇమేజ్ ను సొంతం చేసుకోవటమే మీదనే ఫోకస్ అంతా అన్నట్లుగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి.
అలాంటి తీరునే ప్రదర్శిస్తోంది ఏపీ ప్రభుత్వం. ఎడాపెడా అప్పులు చేస్తున్న జగన్ సర్కారు.. మరిన్ని కొత్త అప్పులు తెచ్చేందుకు వెనుకాడటం లేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి 9 నెలల కాలానికి రూ.43,803 కోట్ల అప్పుల్ని బహిరంగ మార్కెట్ నుంచి రుణాల రూపంలో సేకరించేందుకు అనుమతులు ఇవ్వటం తెలిసిందే. అయితే.. ఈ తొమ్మిది నెలల గడువును మొదటి ఐదు నెలల్లోనే పూర్తి చేయటమే కాదు.. ఇప్పుడు కొత్త అప్పుల కోసం చేస్తున్న ప్రయత్నాలు చూస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే.
ఇప్పటివరకు బహిరంగ మార్కెట్ నుంచి రూ.34,890 కోట్ల రుణాన్ని తీసుకున్న ప్రభుత్వం మంగళవారం మరో రూ.2వేల కోట్ల రుణాన్ని తీసుకునే ప్రతిపాదనల్ని సిద్ధం చేసింది. మరోవైపు బేవరేజస్ కార్పొరేషన్ ద్వారా రూ.8305 కోట్ల రుణాన్ని సమీకరించింది. ఈ రెండింటిని కలిపితే రూ.45,195 కోట్లు అవుతాయి. అంటే.. పరిమితికి మించి దగ్గర దగ్గర రూ.1400 కోట్ల రుణాల్ని ఎక్కువగా తీసుకున్నట్లుగా చెప్పాలి. ఇవే కాకుండా నాబార్డు.. కేంద్రం ఇచ్చిన అప్పులు కూడా ఉన్నాయి.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ లో రూ.4వేల కోట్ల రుణాన్ని తీసుకున్న ఏపీ సర్కారు మే లో ఏకంగా రూ.9890 కోట్ల అప్పు తీసుకుంది. జూన్.. జులై రెండు నెలల్లో రూ.8వేల కోట్లు చొప్పున రూ.16వేల కోట్లు తీసుకుంది. ఆగస్టులో ఇప్పటి వరకు రూ.5వేల కోట్లు తీసుకున్న ఏపీ సర్కారు బెవరేజస్ కార్పొరేషన్ నుంచి రూ.8305 కోట్లు తీసుకోగా.. ఈ నెలాఖరున మరో రూ.2వేల కోట్లకు ప్రతిపాదన తీసుకుంది.
ఇదంతా చూస్తే.. ఆదాయం పెంచుకునే మార్గం లేకపోవడం.. ఖర్చుల్ని తగ్గించుకునే విషయంలో మరో ఆలోచన లేని కారణంగా మరిన్ని అప్పులు తీసుకోవటం తప్పించి మరో పరిష్కారం ఏపీ సర్కారు ముందు లేదన్న మాట వినిపిస్తోంది. అప్పుల విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్న ధోరణి చివరకు ఎక్కడి వరకు వెళుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.