Begin typing your search above and press return to search.
బాలక్రిష్ణ మీద విచారణ జరగబోతుందా?
By: Tupaki Desk | 5 July 2019 5:00 AM GMTఅది చంద్రబాబు హయాం.. హిందుపురం ఎమ్మెల్యే, అప్పటి ఏపీ సీఎం చంద్రబాబుకు స్వయాన బావమరిది బాలక్రిష్ణ. గత ప్రభుత్వ హయాంలో బాలయ్య మీద, ఆయన పీఏ మీద వచ్చిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు.. బాలయ్యకు తెలిసి జరిగిందో.. తెలియకుండా జరిగిందో కానీ..ఆయన పీఏ హిందుపురంలో సమాంతర ప్రభుత్వం నడిపాడన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇసుక మాఫియాను గుప్పిట బట్టి కలెక్షన్ల వసూలు చేశాడని.. చాలా మంది దగ్గర వసూళ్లు చేసినట్టు ప్రజల నుంచే ఆరోపణలు వెల్లువెత్తాయి. చివరకు హిందుపురం ప్రజలు బాలయ్య పీఏ ఆగడాలపై రోడ్డెక్కడంతో బాలయ్య, ప్రభుత్వం అతడిని తొలగించాల్సి వచ్చింది. ఇది నిజంగా జరిగిన నిజం.
ఇసుక మాఫియాతో కోట్లు కొల్లగొట్టారని బాలయ్య పీఏపై ఆరోపణలు వచ్చాయి. మరి ఈ విషయంలో బాలయ్య కూడా లేట్ గా స్పందించడంతో ఆయనపైన నాటి ప్రతిపక్ష వైసీపీ ఆరోపణలు చేసింది. బాలయ్యకు కూడా ఈ మాఫియాతో సంబంధం ఉందని ప్రతిపక్షం ఆరోపించింది. చంద్రబాబు ప్రభుత్వం ఉండడంతో దీనిపై ఎలాంటి చర్యలు, విచారణ జరపులేదు.
అయితే ప్రభుత్వం మారింది. టీడీపీ ఓడిపోయి వైసీపీ ప్రభుత్వం వచ్చింది. కానీ బాలయ్య మాత్రం మళ్లీ హిందూపురంలో గెలవడం విశేషం. నాడు ఆరోపణలు చేసిన వైసీపీ ఇప్పుడు ప్రభుత్వం ఉండడంతో అప్పటి ఆరోపణలు తాలూకా ఆధారలను తాజాగా ఒక ఫైల్ గా జగన్ వద్దకు చేరినట్టు సమాచారం.
ఇప్పుడు ఈ హిందూపురం దందాలపై వైసీపీ ప్రభుత్వం విచారణ చేయబోతుందన్న చర్చ వైసీపీ వర్గాల్లో విస్తృతంగా సాగుతోంది. బాలక్రిష్ణ మీద ఆయన పీఏగా అవినీతికి పాల్పడ్డ వ్యక్తి పైన విచారణకు ప్రభుత్వం ఆదేశించబోతుందన్న వార్త హాట్ టాపిక్ గా మారుతోంది. అంతిమంగా ఇది బాబు బావమరిది బాలయ్య మెడకు చుట్టుకునేలా ఉందన్న ప్రచారం జరుగుతోంది. మరి అవినీతిపై ఉక్కుపాదం అన్న జగన్ ఈ హిందూపురం ఇసుక మాఫియాను వెలికితీస్తారా? బాలయ్యపై విచారణ జరుపుతాడా లేదా అన్నది వేచి చూడాలి.