Begin typing your search above and press return to search.
ఏపీ ఉద్యోగులకు షాక్.. జీతాలు పడలేదు
By: Tupaki Desk | 2 July 2020 2:58 AM GMTఏపీ ఉద్యోగులకు జులై ఒకటో తారీఖున అందాల్సిన జీతాలు ఆలస్యం కానున్నాయి. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. అయితే, ఇది తమ తప్పు కాదని, ప్రతిపక్ష నేత చంద్రబాబు తప్పు అని కన్నబాబు విమర్శించారు. అప్రాప్రియేషన్ బిల్లు ఆమోదం కాకుండా టీడీపీ నాయకులు మండలిలలో అడ్డుకోవడం వల్ల ఖజానాలో డబ్బులు వాడుకోలేకపోతున్నామని కన్నబాబు వెల్లడించారు.
చంద్రబాబు పార్టీ చేసిన పని వల్ల సకాలంలో జీతాలివ్వలేకపోయాం. బిల్లును అడ్డుకున్న చంద్రబాబు ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలి అని కన్నబాబు డిమాండ్ చేశారు. ఉద్యోగులకు కాస్త లేటయినా పింఛన్లు ఆలస్యం కావొద్దని జగన్ చెప్పారని అన్నారు. అందుకే నగదు రూపంలో డ్రా చేసి... ఫించన్లు పంపిణీ చేశామన్నారు. ఉద్యోగుల జీతాలను ఈ విధంగా అందివ్వలేమని అందుకే జీతాల చెల్లింపులో ఆలస్యం అవుతున్నట్టు కన్నబాబు వివరించారు.
కొసమెరుపు ఏంటంటే... డాక్టర్స్ డే రోజున ప్రభుత్వ వైద్యులకు కూడా జీతాలు అందలేదు.
ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గవర్నర్ శనివారం బిల్లును ఆమోదిస్తే జీతాలు వస్తాయని... అన్నారు. గవర్నర్ సంతకం అయ్యే వరకు జీతాలు వేయడానికి కుదరదు అన్నారు.