Begin typing your search above and press return to search.
చంద్రబాబుకి మళ్ళీ షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం...
By: Tupaki Desk | 17 Aug 2019 10:05 AM GMTటీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ ప్రభుత్వం మళ్ళీ షాక్ ఇచ్చింది. ఉండవల్లి అక్రమకట్టడంలో నివాసముంటున్న చంద్రబాబు ఇంటికి మరోసారి నోటీసులు ఇచ్చారు. కృష్ణా నది కరకట్ట దగ్గర వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో, ఇంటిని వెంటనే ఖాళీ చేయాలంటూ.. ఉండవల్లి వీఆర్వో ప్రసాద్ నోటీసులు ఇచ్చారు. అయితే ఇంట్లో ఎవరూ లేకపోవడంతో భద్రతా సిబ్బందికి నోటీసులు ఇచ్చారు.
అలాగే ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందిగా భద్రతా సిబ్బందిని ఆదేశించారు. వరద కారణంగా మనుషులు ఉండడం సురక్షితం కాదని నోటీసుల్లో వీఆర్‌వో హెచ్చరించారు. అయితే నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన వీఆర్వోను చంద్రబాబు సిబ్బంది లోనికి అనుమతించలేదు. కాగా, గత కొన్ని రోజుల నుంచి చంద్రబాబు నివాసానికి వరద ముంపు వ్యవహారంపై అధికార వైసీపీ-ప్రతిపక్షం టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోన్న విషయం తెలిసిందే.
అయితే వైసీపీ అధికారంలో రాగానే కృష్ణా కరకట్టపై అక్రమ కట్టడాలని తొలగించే పనిలో పడింది. నదీ తీరంలో రివర్ కన్జర్వేషన్ యాక్ట్ కు వ్యతిరేకంగా చాలా కట్టడాలు వెలిశాయని, అనుమతులు లేకుండా భారీ భవనాలను ఇష్టమొచ్చినట్టు నిర్మించారని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. అందులో భాగంగా ఆ భవనాలని తొలగించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది.
అందులో మొదటిగా ప్రభుత్వ ప్రజావేదికని కూల్చేసిన విషయం తెలిసిందే. ఇక వీటిలో చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ కూడా ఉంది. దీంతో పాటు కరకట్టలో ఉన్న అక్రమ కట్టడాలకు అంతకముందు నోటీసులు పంపారు. ఇక ఇప్పుడు వరద ఉధృతి ఎక్కువ ఉండటంతో చంద్రబాబు నివాసముంటున్న ఇంటితో పాటు మిగతా వాటికి వీఆర్వో నోటీసులు ఇచ్చారు. మరి దీనిపై చంద్రబాబు, టీడీపీ నేతల నుంచి ఎలాంటి రిప్లై వస్తుందో ? చూడాలి.