Begin typing your search above and press return to search.
దెబ్బకు దిగొచ్చిన కేంద్రం!
By: Tupaki Desk | 16 July 2021 7:39 AM GMTజల వివాదాల విషయంలో జగన్మోహన్ రెడ్డి దెబ్బకు కేంద్రప్రభుత్వం దిగొచ్చింది. కేంద్ర, తెలంగాణా ప్రభుత్వంతో పాటు మేనేజ్మెంట్ బోర్డుల వైఖరికి నిరసనగా ఏపి ప్రభుత్వం ఇలా సుప్రింకోర్టులో కేసు వేసిందో లేదో వెంటనే కేంద్రం స్పీడుగా స్పందించింది. విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య ఉన్న 107 నీటిపారుదల ప్రాజెక్టులన్నింటినీ వెంటనే తన పరిధిలోకి తీసుకుంటు కేంద్రప్రభుత్వం గెజెటి నోటిఫికేషన్ జారీచేసింది.
మేనేజ్మెంట్ బోర్టుల నిర్వహణకు వీలుగా రెండు ప్రభుత్వాలు 60 రోజుల్లోగా చెరి రు. 200 కోట్లు జమచేయాలని గెజెట్ లో స్పష్టంగా చెప్పింది. విభజన చట్టంలోని బ్రజేష్ ట్రైబ్యునల్ ప్రకారం తన కేటాయింపులకు మించి తెలంగాణా ప్రభుత్వం ఎక్కువ నీటిని వాడుకున్నట్లు కేంద్రం నిర్ధారించింది. వివాదాల పరిష్కారం కోసమే రెండు రాష్ట్రాల్లోని నీటి ప్రాజెక్టులను పర్యవేక్షిస్తున్న గోదావరి నదీ నీటి మేనేజ్మెంట్ బోర్డు+కృష్ణా నదీ నీటి మేనేజ్మెంట్ బోర్డుల పర్యవేక్షణలోనే ఇకనుండి నీటి కేటాయింపును కేంద్రమే చేస్తుందని చెప్పింది. అక్టోబర్ 14 నుండి ప్రాజెక్టుల నిర్మాణం, సాగు, తాగు నీటి విడుదల, విద్యుత్ ఉత్పత్తి మొత్తం కేంద్ర పర్యవేక్షణలో జరుగుతుంది.
అలాగే నీటి ప్రాజెక్టుల నిర్వహణే కాకుండా జల విద్యుత్ ఉత్పత్తిని కూడా కేంద్ర పర్యవేక్షణలోనే జరుగుతుంది. ఇంతేకాకుండా ప్రాజెక్టుల భద్రతను కూడా ఇక నుండి తమ బలగాల పర్యవేక్షణలోనే ఉంటాయని కేంద్రం స్పష్టం చేసేసింది. అంటే ఇంతకాలం జగన్ ఏదైతే డిమాండ్ చేస్తున్నారో వాటిన్నింటినీ కేంద్రం అంగీకరించినట్లే. రెండు బోర్డుల్లో పనిచేసే ఉద్యోగులు కూడా ఇక నుండి కేంద్రం పర్యవేక్షణలోనే పనిచేస్తారు.
ఏపి అవసరాలను, అభ్యంతరాలను కేసీయార్ కాస్త పట్టించుకుని ఉంటే ఇపుడీ సమస్య తలెత్తేది కాదు. రెండు రాష్ట్రాల సీఎంలు కూర్చుని మాట్లాడుకుంటే జరిగే సమస్య పరిష్కారం ఇపుడు కేంద్రం చేతిలోకి వెళిపోతోంది. సమైక్య రాష్ట్రాన్ని విడగొట్టిన కారణంగా ప్రాజెక్టులు రెండు రాష్ట్రాల పరిదిలోకి వస్తాయి. అలాంటపుడు ఉభయ రాష్ట్రాల ప్రయోజనాలను గుర్తుంచుకుంటే సమస్యే తలెత్తదు. ఇంతచిన్న విషయాన్ని కేసీయార్ మరచిపోయారు. వివాద పరిష్కారికి ఏపి మంత్రులు ప్రతిపాదించినా తెలంగాణ మంత్రులు లెక్కచేయలేదు.
కనీస నీటిమట్టంతో సంబంధంలేకుండానే జల విద్యుత్ ఉత్పత్తి చేసేశారు. అలాగే విద్యుత్ ఉత్పత్తికి వాడుకున్న నీటిని సముద్రంలోకి వదిలేశారు. నీటికోసం ఒకవైపు ఏపి ఇబ్బందులు పడుతుంటే మరోవైపు కేసీయార్ నీటి కేటాయింపులపై వివాదాన్ని రేపారు. 299 టీఎంసీల నీటి కేటాయింపుకు బదులుగా 400 టీఎంసీలను ఇవ్వాల్సందే అంటు కొత్తగా వాదన మొదలుపెట్టారు. ఇవన్నీ చూసిన తర్వాత ఇక తెలంగాణా ప్రభుత్వంతో మాట్లాడి ఉపయోగం లేదని జగన్ కు అర్ధమైపోయింది.
అందుకనే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు లేఖరాశారు. ఉపయోగం కనబడకపోవటంతో కంద్రానికి లేఖరాశారు. అయినా ఫలితం కనబడలేదు. దాంతో ఏకంగా సుప్రింకోర్టులో కేసు వేశారు. దాంతో వెంటనే కేంద్రం స్పందించి జగన్ డిమాండ్లకు అనుగుణంగా గెజెట్ నోటిఫికేషన్ జారీచేసింది. అంటే గెజెట్ ప్రకారం తొందరలో రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నీ కేంద్రం చేతిలోకి వెళిపోతున్నాయి. అంతా అయిపోయిన తర్వాత ఇపుడు కేంద్రంపై కేసీయార్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదట్లోనే ఏపి అవసరాలను కూడా కేసీయార్ దృష్టి పెట్టుకునుంటే ఇపుడు కేంద్రం జోక్యానికి అవకాశమే ఉండేదికాదు.