Begin typing your search above and press return to search.
టీడీపీకి మరో దెబ్బ..కుటుంబరావు కబ్జాకోరేనని నిర్ధారణ
By: Tupaki Desk | 13 Sep 2019 5:29 PM GMTఏపీలో విపక్ష పార్టీగా మారిన తెలుగు దేశం పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడిపోతోంది. ఇప్పటికే గడచిన ఎన్నికల్లో ఘోరాతిఘోరంగా ఓడిన టీడీపీని చాలా మంది కీలక నేతలు వదిలివెళ్లిపోయారు. ఇక పార్టీలో మిగిలి ఉన్న నేతలు... టీడీపీ అధికారంలో ఉండగా.. అధికారాన్నే ఆసరా చేసుకుని సాగించిన దందాలన్నీ ఒక్కటొక్కటిగానే బయటపడుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ సర్కారులో కీలకంగా వ్యవహరించిన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావు పై ఇప్పుడు కబ్జా కోరు ముద్రపడిపోయింది. విజయవాడ మధురా నగర్ లో కుటుంబరావు కుటుంబం కబ్జా చేసిన ప్రభుత్వ భూమిని శుక్రవారం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ ఘటనతో టీడీపీకి మరో భారీ దెబ్బ పడిపోయిందని చెప్పక తప్పదు.
మధురానగర్ లో ప్రభుత్వానికి చెందిన భూమిని కుటుంబరావు కుటుంబ సభ్యులు కబ్జా చేసేశారు. చేతి లో అధికారంతో రికార్డులను తారుమారు చేసి ఆ భూమిని కొట్టేశారు. దాదాపు రూ.200 కోట్లకు పైగా విలువ చేసే ఈ భూమిని దక్కించుకున్న కుటుంబరావు ఫ్యామిలీ... రికార్డులను తారుమారు చేసి ఆ భూమి తమదేనని రికార్డుల్లో మార్పించేసుకున్నారు. అయితే ఈ భూమి కుటుంబరావు ఫ్యామిలీది కాదని - ప్రభుత్వానికి చెందిన భూమిని కుటుంబరావు ఫ్యామిలీ అక్రమంగా కబ్జా చేసిందని ఇటీవల కృష్ణా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన స్పందనకు ఓ ఫిర్యాదు అందింది.
టీడీపీ హయాంలో ప్రత్యేకించి గడచిన ఎన్నికలకు ముందు టీడీపీ వాయిస్ ను తనదైన శైలిలో వినిపించిన కుటుంబరావుపై ఫిర్యాదు రావడంతో పెను కలకలం రేగింది. టీడీపీలో ముఖ్య నేతగా ఉన్న కుటుంబరావుపై ఫిర్యాదు అనగానే.. అందులోనూ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తిపై ఫిర్యాదు రావడంతో అధికారులు తక్షణమే స్పందించక తప్పలేదు. తమకు అందిన ఫిర్యాదును రెవెన్యూ అధికారులకు అప్పగించిన కలెక్టర్... ఈ ఫిర్యాదు సంగతేంటో చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలతో రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు విచారణ చేయగా...ఆ భూమిని దక్కించుకునేందుకు కుటుంబరావు నెరపిన మంత్రాంగం మొత్తం వెలుగులోకి వచ్చేసింది. దీంతో కుటుంబరావు కబ్జాకోరేనని రెవెన్యూ అధికారులు కలెక్టర్ కు నివేదిక అందజేశారు.
ఆ వెంటనే కలెక్టర్ కూడా తదుపరి చర్యలకు ఆదేశాలు జారీ చేయగా... కుటుంబరావు కుటుంబీకుల చేతుల్లో ఉన్న స్థలం గేటుకు జాయింట్ కలెక్టర్ మాధవీలత నోటీసులు అంటించారు. కలెక్టర్ ఆదేశాలతో రికార్డులు పరిశీలించి విచారణ జరపగా... ఈ భూమి కబ్జాకు గురైందని, ఆ భూమి తమదేనని కుటుంబరావు కుటుంబం చెప్పుకుంటోందని జాయింట్ కలెక్టర్ తెలిపారు. అర్బన్ ల్యాండ్ చట్టాన్ని ఉల్లంఘించి ప్రభుత్వ మిగులు భూమిని ఆక్రమించారని తేలిందని పేర్కొన్నారు. రెవెన్యూ, రైల్వే అధికారులను తప్పుదారి పట్టించి పట్టాభూమిగా స్వాధీనం చేసుకున్నారన్నారు. ప్రభుత్వ భూమిని కబ్జాకు గురైన భూమిని స్వాధీనం చేసుకోవడంతో పాటుగా ఈ భూమిని కబ్జా చేసిన కుటుంబరావు ఫ్యామిలీపైనా ఐపీసీ సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు పెట్టామని వెల్లడించారు. ఎవరైనా ఆ భూమిలోకి చొరబడాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని జేసీ హెచ్చరించారు.