Begin typing your search above and press return to search.

మ‌రొక‌సారి మ‌డ‌మ తిప్పిన‌ట్టేనా?

By:  Tupaki Desk   |   18 Dec 2021 4:30 PM GMT
మ‌రొక‌సారి మ‌డ‌మ తిప్పిన‌ట్టేనా?
X
ఏపీ ప్ర‌భుత్వం తాజాగా మ‌ద్యం ధ‌ర‌ల‌ను త‌గ్గించింది. గత ఎన్నిక‌ల స‌మ‌యంలో విడ‌త‌ల వారీగా మ‌ద్యం నిషేధిస్తామ‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మ‌ద్యం అన్న‌ది లేకుండా చేస్తామ‌ని.. వైసీపీ అధినేత‌గా.. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ప్ర‌స్తుత సీఎం జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చారు. దీనినే న‌వ‌ర‌త్నాల్లోనూ పేర్కొన్నారు. అంతేకాదు.. మ‌ద్యాన్ని తాగే అల‌వాటు త‌గ్గించ‌డంలో భాగంగానే.. ధ‌ర‌ల‌ను కూడా భారీగా పెంచుతామ‌న్నారు. ``తాగితేకాదు.. ముట్టుకుంటేనే షాక్ కోట్టేలా ధ‌ర‌లు పెంచుతాం. దీంతో మ‌ద్యం తాగే వారుత‌గ్గిపోతారు`` అని చెప్పారు.

ఇక‌, అధికారంలోకి రాగానే.. మ‌ద్య దుకాణాల‌ను ప్ర‌భుత్వం హాండోవ‌ర్ చేసుకుంది. బార్లు త‌ప్ప వైన్ షాపుల‌ను స‌ర్కారే మెయింటెన్ చేస్తోంది. అంతేకాదు.. ధ‌ర‌ల‌ను భారీగానే పెంచింది. అయితే.. మ‌ద్యం తాగే వాళ్ల‌ను త‌గ్గించ‌క‌పోగా.. ప్రోత్స‌హించేలా చేస్తోంద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఎందుకంటే.. నిజానికి మ‌ద్య నిషేధం చేయాల‌ని అనుకున్న‌ప్పుడు.. గ‌తంలో లాక్‌డౌన్ స‌మ‌యంలో 40 రోజ‌లు షాపులు ఎక్క‌డా తెర‌వ‌లేదు. దీంతో మందుబాబులు అల‌వాటు మానుకున్నారు. కానీ, ప్ర‌భుత్వం మాత్రం మ‌ళ్లీ అన్నింటిక‌న్నా ముందు మ‌ద్యం షాపుల‌కుఅనుమ‌తి ఇచ్చింది.

ఇక‌, ఇటీవ‌ల కొన్ని ధ‌ర‌ల‌ను కూడా త‌గ్గించింది. స‌రే.. ఇప్పుడు మ‌రోసారి.. ధ‌ర‌లు త‌గ్గిస్తూ.. నిర్ణ‌యం తీసుకుంది. వ్యాట్‌, ఎక్సైజ్‌ డ్యూటీ మార్జిన్‌లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఇండియన్‌ మేడ్‌ఫారిన్‌ లిక్కర్‌పై 5 నుంచి 12 శాతం తగ్గించింది. అన్ని కేటగిరిల మద్యంపై 20 శాతం వరకు ధరలను తగ్గించనుంది ప్రభుత్వం. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న అక్రమ మద్యం, నాటుసారా తయారీని అరికట్టేందుకు ధర తగ్గింపునకు నిర్ణయం తీసుకుంది. మద్యం ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో మ‌రింత‌గా తాగేవారు పెరుగడం ఖాయ‌మ‌ని.. ఇక‌, నిషేధం లేన‌ట్టేన‌నిప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇదిలావుంటే.. వ‌చ్చే వారం నుంచి ప్ర‌ముఖ బ్రాండ్ల‌ను కూడా ప్ర‌వేశ పెడుతున్న‌ట్టు ప్ర‌భుత్వం తెలిపింది. జ‌గ‌న్ స‌ర్కారు ఆధ్వ‌రంలో.. న‌డుపుతున్న వైన్ షాపుల్లో.. బ్రాండెడ్ మ‌ద్యం అమ్మ‌డం లేదు. ఎవ‌రో.. ఎక్క‌డో త‌యారు చేసుకున్న మందును తీసుకువ‌చ్చి.. పేరు ఊరు ఎప్పుడూ.. ఎవ‌రూ విన‌ని వాటిని అమ్ముతున్నారు. దీంతో పొరుగు రాష్ట్రాల నుంచి మ‌ద్యం అక్ర‌మ ర‌వాణా జ‌రుగుతున్న మాట వాస్త‌వ‌మే. దీంతో ఇప్పుడు బ్రాండెడ్ స‌రుకు కూడా వ‌చ్చేవారం నుంచి అందుబాటులోకి తెస్తున్న‌ట్టు స‌ర్కారు తెలిపింది. అయితే.. ఈ బ్రాండ్‌లో ఏబ్రాండ్‌ల‌ను క‌లుపుతారో.. ఎలాంటి బ్రాండ్ల‌ను మిస్ చేస్తారో చూడాలి. మొత్తానికి మ‌ద్య నిషేధంపై... స‌ర్కారు మ‌రోసారి ధ‌ర‌లు త‌గ్గించ‌డం ద్వారా.. మ‌డ‌మ తిప్పిన‌ట్టే అంటున్నారు ప‌రిశీల‌కులు.