Begin typing your search above and press return to search.

కరోనా వేళ భరించాల్సిందే.. ఏపీలో గ్యాస్ ధరల మంట!

By:  Tupaki Desk   |   12 Sept 2020 5:40 PM IST
కరోనా వేళ భరించాల్సిందే.. ఏపీలో గ్యాస్ ధరల మంట!
X
ఏపీ ప్రజలపై జగన్ పన్నుల భారాన్ని మోపేస్తున్నారు. కరోనా లాక్ డౌన్ తో కుదేలైన ఆర్థిక వ్యవస్థలను కాపాడడానికి పన్నుల విధింపు తప్ప ఏపీకి మరో మార్గం కనిపించడం లేదని అంటున్నారు.అందుకే ఏపీ జనాలపై తాజాగా గ్యాస్ ధరల బండ పడింది.

ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకునేందుకు ఏపీలో గ్యాస్ ధరలపై వ్యాట్ ను భారీగా పెంచుతూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏకంగా పదిశాతం పెరిగిన వ్యాట్ తో గ్యాస్ ధరలు మండిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఏపీలో నవరత్నాలు, ప్రాజెక్టులు సహా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను జగన్ సర్కార్ అమలు చేస్తోంది. అయితే కరోనా లాక్ డౌన్ తో సరిపడా ఆదాయం రావడం లేదు. దీంతో గ్యాస్ పై వ్యాట్ ను తాజాగా 14.5శాతం నుంచి 24.5శాతం మేర పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పది శాతం మేర గ్యాస్ పై వ్యాట్ పెంపు కారణంగా ఆర్థిక ఇబ్బందులు తీరుతాయని జగన్ సర్కార్ భావిస్తోంది.

జగన్ సర్కార్ తాజా నిర్ణయం వల్ల గ్యాస్ ధరలు భారీగా పెరగబోతున్నాయి. రాష్ట్ర ఖజానాకు భారీగా రాబడి రానుంది.

కాగా ఆదాయం వచ్చే అన్ని దారులూ మూసుకుపోయాయని..అందుకే వ్యాట్ పెంచక తప్పడం లేదని ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. దీన్నిబట్టి సంక్షేమ పథకాలనే ఏపీ ప్రభుత్వానికి భారం అవుతున్నాయని.. దానికోసం మళ్లీ ప్రజల నెత్తినే భారం మోపుతున్నారని అర్థమవుతోంది.