Begin typing your search above and press return to search.

కోర్టు ధిక్కరణ కేసులో ఏపీ సర్కార్

By:  Tupaki Desk   |   17 Aug 2022 2:34 PM GMT
కోర్టు ధిక్కరణ కేసులో ఏపీ సర్కార్
X
ఏపీ ప్రభుత్వం మీద కోర్టులలో అనేక కేసులు పడడం ఆ మీదట ప్రభుత్వానికి ప్రతికూల తీర్పులు రావడం అన్నది మూడేళ్ళుగా జరుగుతున్నదే. ఒక దశలో ప్రభుత్వం మీద పడ్డ కేసులు చాలా ఎక్కువగానే ఉన్నాయి. అవి సెంచరీని కూడా దాటిపోయాయి. ఇక ప్రభుత్వం మీద పలు కేసులను విచారించిన సందర్భంగా హై కోర్టు డైరెక్షన్స్ ఇస్తుంది.

వాటిని ప్రభుత్వం సక్రమంగా పాటించకపోతే అది కచ్చితంగా కోర్టు ధిక్కరణ కేసు కిందకే వస్తుంది. ఇపుడు అలాంటిదే ఒక కేసు హై కోర్టులో పిటిషనర్ దాఖలు చేశారు.

ఏపీలో పలువురు ప్రజా ప్రతినిధుల మీద కేసులు ప్రభుత్వం అడ్డగోలుగా ఉప సంహరించుకోవడం అంటే అది సుప్రీం కోర్టు నియమ నిబంధనలకు విరుద్ధంగా జరిగిన వ్యవహారమని పేర్కొంటూ ఒక వ్యక్తి హై కోర్టులో కేసు వేశారు.

దీనిని విచారించిన హై కోర్టు అసలు ఈ వ్యవహారాన్ని కోర్టు ధిక్కరణ కింద ఎందుకు పరిగణించకూడదని నేరుగా సర్కార్ నే ప్రశ్నించడం విశేషం.

అంతే కాదు ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కేసులు ఉప సంహరించిందో ఆ వివరాలు కూడా తనకు తెలియచేయాలని వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ తదుపరి విచారణను వచ్చే వారానికి వేసింది. మొత్తానికి ఏపీ సర్కార్ మీద కోర్టు ధిక్కరణ కేసు అయితే పడింది. మరి దాని మీద ప్రభుత్వ వివరణ ఎలా ఉంటుందో చూడాలి.